సాక్షిని మూసేస్తావా: జగన్‌పై నారాయణ అసహనం, ఉద్యోగులకు భవనాలు

నెల్లూరు: పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు. తన పైన వైసిపి అనవసర ఆరోపణలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతి తరలించే అంశంపై మాట్లాడుతూ.. ఉద్యోగుల కోసం త్వరలో భవనాలు నిర్మిస్తామని చెప్పారు.

సాక్షి పత్రిక పైన మంత్రి నారాయణ మండిపడ్డారు. ఏదో ఒకటి సృష్టించి తమ పైన బురదజల్లడమే సాక్షి దినపత్రిక పనిగా పెట్టుకుందన్నారు. ఇంతవరకు నేను ఒక్క కాంట్రాక్టర్‌ను కూడా కలవలేదన్నారు. కానీ ప్రతిరోజు సాక్షి పత్రికలో తాను వెళ్లి కాంట్రాక్టర్లను కలిసినట్లు తప్పుడు రాతలు రాస్తున్నాయన్నారు.

నేనే కాంట్రాక్టర్లను కలిసినట్లు రుజువు చేస్తే పదవి నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. లేదంటే సాక్షి పత్రికను మూసేస్తారా? అని జగన్‌కు సవాల్ చేశారు. ప్రభుత్వం, రైతుల మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యాచరణలో సిఎం చంద్రబాబు ఉన్నారన్నారు.

Building to employees soon in Amravati: Narayana

రుణమాఫీపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ

రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం విజయవాడ స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో సమావేశమైంది. ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి తొలుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం కార్యకర్తలను, సందర్శకులను కలుస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై సమీక్షిస్తారు.

ఏలూరు కార్పోరేషన్ సమావేశం రసాభాస

ఏలూరు కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం గురువారం నాడు రసాభాసగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి మూడు నెలలకు సమావేశం నిర్వహించవలసి ఉంది. ఐదు నెలలకు సమావేశం నిర్వహించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+