ఏపీ పారిశ్రామిక ప్రగతిలో కేంద్రం వాటా.. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి బాట!!
దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని ఏడవ అతిపెద్ద రాష్ట్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో శిలాజ నిక్షేపాలకు ఖనిజ సంపదలకు ఏపీ పేరుగాంచింది . ఇక్కడ ఉన్న ఈ ఖనిజ సంపద రాష్ట్రాన్ని "రత్నగర్భ" అని పిలిచేలా చేస్తుంది. సహజసిద్ధమైన వనరులే కాకుండా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది. భారత త్రివర్ణ పతాకం రూపకర్తగా ఘనత వహించిన పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లోనే జన్మించారు.
స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షిస్తున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం స్వదేశీ మరియు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రభుత్వ నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. ఉత్పాదకతను పెంచడానికి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ప్రాముఖ్యత, ప్రయోజనాలను గుర్తించి అనేక పారిశ్రామిక సమూహాలను ఏర్పాటుచేసింది.

కేంద్రప్రభుత్వ సాయంతో ఏపీలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు
ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడం, గ్లోబల్ మార్కెట్లో ఉనికిని చాటడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం అనేక రకాలుగా సాయం చేసింది . అందులో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్‌లోని రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో వివిధ ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలను స్థాపించింది. ఈ క్లస్టర్ సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది.
పవర్ క్లస్టర్ గా కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతం పవర్ క్లస్టర్ గా రూపుదిద్దుకుంది. కృష్ణపట్నం ఓడరేవు చుట్టుపక్కల ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యుత్ సంస్థలు అనేకం ఉన్నాయి. అందువల్ల, ఈ ప్రాంతం పవర్ క్లస్టర్‌గా అభివృద్ధి చెందింది. ఈ పవర్ ప్లాంట్లు బొగ్గు ఆధారిత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి . సుమారు 14,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
కేంద్రం అందించిన అరటి క్లస్టర్ ప్రాజెక్టు
కడప జిల్లా పులివెందులలో అరటిరైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం 4. 82 కోట్ల రూపాయలతో అరటి క్లస్టర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబడింది . కడప, అనంతపురం జిల్లాల్లో అరటిని విస్తారంగా సాగు చేస్తున్నా రు. పులివెందులలో సాగు చేసే అరటిరకాలకు దేశ, విదేశీ మార్కెట్లలో డిమాండ్ ఉంది.ఆంధప్రద్రేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MSME మంత్రిత్వశాఖ యొక్క SFURTI కింద పులివెందుల బనానా ప్రాసెసింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్ ఏర్పా టు చేశారు.
అరటి మొక్కలో ప్రతీభాగం వాణిజ్యీకరణ
అరటి మొక్క లోని ప్రతి భాగాన్ని వాణిజ్యీకరణ కోసం ఉపయోగించడం, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క పధ్రాన లక్ష్యం. ఈ క్లస్టర్ నుండి వచ్చే విలువైన ఉత్పత్తుల్లో .. అరటిపండు పొడి, అరటి కాండం జ్యూస్, అరటి నార కప్పు లు, అరటి నార ప్లేట్లు, అరటి ఫైబర్ మరియు తేనెలో ముంచిన అరటిపండు ముక్కలు లభిస్తాయి . పులివెందుల ఔత్సాహిక రైతులు అరటి పంటల సాగులో టిష్యూ కల్చర్, డ్రిప్ ఇరిగేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నా రు .
మంగళగిరిలో జ్యూవెలరీ క్లస్టర్
ఏపీలో మరో ముఖ్యమైనది మంగళగిరి జ్యువెలరీ క్లస్టర్.గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న జ్యువెలరీ క్లస్టర్ లో BISద్వారా ఆమోదించబడిన హాల్‌మార్కింగ్ సెంటర్ ఉంది . సుమారు 1100 స్వర్ణకళాకారులు ఇక్కడ పని చేస్తున్నారు. చేతివృత్తి స్వర్ణకారులకు ఉపాధి కల్పించడం వారి నైపుణ్యాలను ఉపయోగించుకోవడమే ఈ క్లస్టర్ లక్ష్యం. హ్యాండ్ మేడ్ నగలకు పెరుగుతున్న ప్రజాదరణతో, వీరు అద్భుతమైన ఆభరణాలు తయారు చేస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద వస్త్ర తయారీ పార్కులలో ఒకటిగా బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ పేరుగాంచింది. విశాఖపట్నం నగరంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఇది కొనసాగుతుంది. పర్యావరణ సుస్థిరత పట్ల బలమైన నిబద్ధతతో BIAC స్థిరమైన భవిష్యత్తు కోసం దోహదపడుతోంది. BIAC అనేది జీరో ల్యాండ్‌ఫిల్ అప్పెరల్ పార్క్. వ్యర్థాలను నివారించే సోలార్ స్లడ్జ్ డ్రైయింగ్ ప్రాసెస్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రంలో మొదటి పరిశ్రమ ఇదే .
పర్యావరణ పరిరక్షణకు పట్టం కడుతున్న బ్రాండిక్స్ ఇండియా
పార్క్ వార్షిక నీటి వినియోగంలో 30% నిలకడగా ఉండేలా వర్షపు నీటిని సేకరిస్తోంది. క్లీన్ ఎనర్జీలో నిరంతర పెట్టుబడులు, పవర్ ఆప్టిమైజేషన్ కోసం ప్రయత్నాలతో, పార్క్ 2030నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హార్వెస్టింగ్ పాండ్ , సోలార్ పవర్ సప్లై, అల్ట్రా-మోడర్న్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పారిశ్రామిక వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి శుద్ధి కర్మాగారంతో 100% పర్యావరణ పరిరక్షణకు పట్టంకడుతూ బ్రాండిక్స్ ఇండియా నిలిచింది.

ఏపీ చేనేతకు కేంద్రం చేయూత
ఏపీలో కలంకారీ క్లస్టర్ పరిరక్షణకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తోంది. భారతీయ చేనేతపరిశ్రమ చాలా పురాతనమైనది. ఇది దేశంలో ఉన్న తొలి రంగాలలో ఒకటి. ఇది దేశ ఆర్థికవ్యవస్థలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ రంగానికి సంబంధించిన అనేక సమస్యలు పరిశ్రమ వృద్ధికి అడ్డంకిని సృష్టిస్తున్నాయి. చేనేత కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. తక్కువ వేతనాలు, కఠినమైన పని పరిస్థితుల కారణంగా యువతరం చేనేత వృత్తిని స్వీకరించడం లేదు.
కేంద్రం సహకారంతో ఏపీలో కలంకారీ క్లస్టర్స్
హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ గొప్ప విలువ కలిగి ఉంటాయి . ఈ క్రమంలో చేనేతను పునరుద్ధరించడానికి అందులో భాగంగానే కలంకారీ కళ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టింది కేంద్రం . కలంకారీ క్లస్టర్స్ ని శ్రీకాళహస్తి మరియు మచిలీపట్నంలో ఏర్పాటు చేసింది.యువతకు కలంకారీలో శిక్షణ ఇవ్వడంతోపాటూ, శ్రీకాళహస్తి చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది మహిళలకు ఉపాధి అందిస్తున్నారు.
కేంద్రం అందించిన ఫిరంగిపురం స్పైస్ క్లస్టర్
ఇదే తరహాలో భారత ప్రభుత్వం SFURTI పథకం కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల స్పైస్ క్లస్టర్లను ఏర్పాటు చేసింది.. అందులో ఫిరంగిపురం స్పైస్ క్లస్టర్ ఒకటి. భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి నిధి పథకం క్రింద ఫిరంగిపురం స్పైస్ క్లస్టర్ ను ఏర్పాటు చేసింది.
ఏపీ కాకినాడ తీరం దగ్గరే ONGC చమురు ఉత్పత్తి
కృష్ణా-గోదావరి డీప్ వాటర్ బ్లాక్‌లో కొత్త ముడి చమురును కనుగొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి 30 కి.మీ దూరంలో,రాష్ట్ర యాజమాన్యంలోని ONGC కంపెనీ తన మొదటి చమురు ఉత్పత్తిని బంగాళాఖాతం నుండి ప్రారంభించింది. సమాజానికి లబ్ది కలిగించే, పర్యావరణానికి మేలు చేసే సిఎస్ఆర్ కార్యకలాపాలలో భాగంగా కియా ఇండియా ద్వారా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది.
కియా సంస్థతో ఉపాధి, నూతన ఆవిష్కరణలకు మార్గం
ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన అనంతపూర్, నంద్యాల మరియు శ్రీ సత్య సాయిలోని కియా సంస్థలో పని చేసే కార్మికులు, విద్యార్థులకి ప్రయోజనం చేకూర్చడం కోసం నిర్వహించబడుతోంది. కియా కార్ల తయారీ కర్మాగారంలో ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడానికి సేఫ్టీ ఎక్స్‌పీరియన్స్ ట్రైనింగ్ సెంటర్'ను ప్రారంభించింది. అంతేకాకుండా.. విద్యార్థులకు ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలకు దోహదం చేస్తాయని,అనంతపురం, నంద్యాల లోని ప్రభుత్వ విద్యా సంస్థలకు 8 కార్లను కియా సంస్థ విరాళంగా ఇచ్చింది
కేంద్రం సహకారంతో ఏపీలో పారిశ్రామికాభివృద్ధి
కేంద్రం సహకారంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఈ సమిష్టి కృషి వల్ల ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పించడం సహా, దేశీయ పెట్టుబడులు , విదేశీ పెట్టుబడుల్ని సైతం ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోంది . రాష్ట్రంలో కేంద్రం సహకారంతో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతి ఇటు ఆర్థికాభివృద్ధి, అటు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications