మనవడికి బుల్లెట్ ప్రూఫ్ కారు, వేడుకల్లో బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, లోకష్ కుమారుడికి భద్రతను మరింతగా పెంచారు. ఆ చిన్నారికి ఇప్పటికే నలుగురు కానిస్టేబుళ్లు ఉండగా, తాజాగా బుల్లెట్ ప్రూఫ్ కారుని సైతం అందుబాటులోకి తెచ్చారు.
ఉగాది రోజున నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు మనవడు ప్రస్తుతం తాత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి రక్షణ నిమిత్తం చంద్రబాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆదివారం నుంచి వారసుడి చక్కర్లకు అందుబాటులో ఉంచారు.
ఇక చంద్రబాబు అదివారం నాడు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఏప్రిల్ 12న చైనా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు 17వ తేదీ రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం నాడు సెక్రటేరియట్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఘనంగా సోమవారం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో సోమవారం ఆయన 65వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ, శ్రీకాళహస్తి వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎన్టీర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు, పార్టీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నా జీవితం తెలుగు జాతికి అంకితమని అన్నారు.
రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేత్ర, దంత వైద్య, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అంధులకు బ్రెయిలీ ల్యాప్ టాప్‌లను అందజేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్‌లు సోమవారం ఉదయం ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications