తిరుమల శ్రీవారి అన్నదానానికి విరాళమిస్తే టీటీడీ మీకిచ్చే బంపర్ ఆఫర్లు మాములుగా లేవుగా!
కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాద్రి శిఖరంపైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోరి కొలిచిన వారి కొంగుబంగారం. అటువంటి తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తపించిపోయే భక్తులు ఉన్నారు. అటువంటి భక్తులు తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నదానం చేయడానికి విరాళాలు ఇస్తే వారికి టీటీడీ అద్భుతమైన ఆఫర్లు ఇస్తుంది.
శ్రీవారి ఆలయంలో అన్నదానం కోసం విరాళం
ప్రతి రోజు స్వామివారి ఆలయంలో లక్ష మందికి పైగా భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ అన్నదాన పథకం కింద విరాళాలకు రెండు అవకాశాలు ఉన్నాయి. భక్తులు ఒక రూపాయి నుంచి కోటి రూపాయల వరకు ఆ పైన ఎంతైనా కూడా అన్నదానానికి ఇవ్వవచ్చు. ఇంకొక విధానంలో ఒక రోజు మొత్తం అన్నదానానికి 44 లక్షల రూపాయలు ఖర్చవుతుంది.

అన్నదానం కోసం విరాళం ఇచ్చిన భక్తులకు దర్శనం, సౌకర్యాలు
అల్పాహారానికి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మధ్యాహ్నం భోజనానికి 17 లక్షలు, రాత్రి భోజనానికి 17 లక్షలు ఖర్చవుతుంది. అయితే తిరుమలలో శ్రీవారి భక్తులు ఎవరైతే లక్ష రూపాయలు ఆ పైన అన్నదానం కోసం ఇస్తారో వారికి స్వామి వారి దర్శనంతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తారు.
లక్ష నుండి 5లక్షల విరాళం ఇస్తే
లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు అన్నదానం కోసం విరాళం ఇచ్చిన భక్తులకు, వారి కుటుంబ సభ్యుల ఐదుగురికి మూడు రోజులు సుపథం దర్శనం, వంద రూపాయల గదిలో వసతి, పది చిన్న లడ్డులు, ఐదు మహా ప్రసాదాలు, ఒక దుపట్టా, జాకెట్ ముక్క ఇస్తారు.
పది లక్షల నుండి 25 లక్షల విరాళం ఇస్తే
పదిలక్షల నుంచి 25 లక్షలు ఇచ్చినవారికి, ఆ కుటుంబాలకు కూడా ఐదుగురికి మూడు రోజుల బిగినింగ్ బ్రేక్ దర్శనం, వెయ్యి రూపాయల గది వసతి, 20 చిన్న లడ్డులు, పది మహా ప్రసాదాలు, ఒక దుపట్టా, జాకెట్ ముక్క, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
25 లక్షల నుండి 50 లక్షల వరకు విరాళం ఇస్తే
ఇక 25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన కుటుంబాలకు ఐదుగురికి మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం, ఒకరోజు శుపథం దర్శనం, 1500 రూపాయల గదిలో వసతి, నాలుగు పెద్ద లడ్డులు, ఐదు చిన్న లడ్డూలు, 10 మహా ప్రసాదాలు, దుపట్టా, జాకెట్ ముక్క. ఐదు గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
75 లక్షల నుండి కోటి రూపాయల వరకు విరాళం ఇస్తే
75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు విరాళాలు ఇచ్చిన వారికి, ఆ ఫ్యామిలీకి ఐదుగురికి రెండు రోజులు సుప్రభాత సేవ, నాలుగు రోజులు సుపథం నుంచి, మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. పది చిన్న లడ్డులు 20 పెద్ద లడ్డులు పది మహా ప్రసాదాలు దుపట్టా జాకెట్ ముక్క ఒకరోజు వేద ఆశీర్వచనం ఐదు గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
కోటి రూపాయలు, ఆపైన విరాళం ఇస్తే
కోటి రూపాయలు ఆ పైన విరాళానికి ఐదుగురికి మూడు రోజులపాటు సుప్రభాత సేవ, నాలుగు రోజులు సుపథం నుండి దర్శనం, మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. పది చిన్న లడ్డులు, 20 పెద్ద లడ్డులు, 10 మహా ప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక జాకెట్ ముక్క, ఒకరోజు వేద ఆశీర్వచనం, ఐదు గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.












Click it and Unblock the Notifications