మహిళలకు వేధింపులు: టీ బస్సుల్లో ముళ్లకంచె

మహిళల భద్రత పైన పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ప్రయోగాత్మకంగా హైదరాబాదులో అమలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడి ఫలితాల అధ్యయనం తర్వాత దశలవారీగా మిగిలిన నగరాలకు విస్తరిస్తారు. వీటి అమలుపై ఆర్టీసీ అధికారులు సోమవారం ఆయా నమూనాలను పరిశీలించారు.
సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ మార్గంలో నడిచే బస్సుల్లో (8ఏ) మహిళలకు ప్రత్యేకించిన సీట్ల వెనుకాల రక్షణ ఏర్పాట్లు చేస్తారు. మహిళల సీట్ల వెనుక కూర్చునే పురుషుల వేధింపుల నుండి వారిని కాపాడాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవి రమణ తెలిపారు. అక్టోబర్ 1 నుండి దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.












Click it and Unblock the Notifications