జగన్‌కు ఝలకిచ్చిన రేణుక పెదవి విప్పారు (పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆదివారం పెద్ద షాకిచ్చారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరగా, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపికి అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని చెప్పారు.
కాగా, తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో ఘోర పరాజయం చూసిన కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆదివారం పొన్నాల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బుట్టా రేణుక
చంద్రబాబుతో కర్నూలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ బుట్టా రేణుక భేటీ ఆదివారం అయ్యారు. ఆదివారం ఉదయం రేణుక భర్త నీలకంఠం టిడిపిలో చేరారు. ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తాను టిడిపిలో చేరడం లేదని అయితే టిడిపి అనుబంధ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. తనపై వేటు వేస్తే శక్తి ఉంటే తిరిగి పోటీ చేస్తానని లేకపోతే సమాజ సేవ చేసుకుంటానన్నారు. తన నియోజకవర్గం ఎన్నో రకాలుగా వెనుకబడి ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలిశానన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సహాయ సహకారాలు ఉంటేనే అభివృద్ధిని సాధించగలమన్నారు.

ఏరాసు ప్రతాప్ రెడ్డి
మాజీ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం.

ఏరాసు ప్రతాప్ రెడ్డి
మాజీ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం. పక్కన ఇతర నాయకులు.

పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ భవన్‌లో మాట్లాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య దృశ్యం.

పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ భవన్‌లో మాట్లాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. పక్కన జానా రెడ్డి, డి శ్రీనివాస్, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు.












Click it and Unblock the Notifications