వెంకయ్య మాట సరి కాదు: 'ప్రత్యేకత'పై రాఘవులు, కల్పిస్తామని సుజనా
న్యూఢిల్లీ/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పోలవరం ముంపు ప్రాంత ప్రజల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. శనివారం నాడు ఢిల్లీలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, భూసేకరణ బిల్లు, పార్టీ నాయకత్వం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాఘవులు ప్రసంగించారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడు అనడం సరికాదన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేసైనా సరే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తన విచక్షణాధికారంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని సూచించారు. 14 ఆర్థిక సంఘం నివేదిక శిలాశాసనం కాదన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై చట్టం చేస్తే కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.

పార్లమెంటులో చట్టం చేసైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనాచౌదరి అన్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పర్యటించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications