తెలంగాణని ఆపలేరు, కావూరి ఎవరు?: బైరెడ్డి హెచ్చరిక

 Byreddy demands capital in Rayalaseema
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, దానిని ఎవరు ఆపలేరని అయితే, రాయలసీమకు రాజధానిని ఇవ్వాల్సిందేనని లేదంటే తీవ్ర ఉద్యమం ఉంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం కోసం 1956లో అప్పటి కర్నూలు కేంద్రంగా ఉన్న రాజధానిని వదులుకున్నామని, ఇప్పుడు విభజన నేపథ్యంలో నూతన రాజధానిని మళ్లీ కర్నూలులోనే ఏర్పాటు చేయాలన్నారు.

కర్నూలు కాకపోతే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేయాలన్నారు. విభజన తర్వాత సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హైకోర్టు ఇస్తారన్న వార్తలపై ఆయన మండిపడ్డారు. హైకోర్టుతో రాయలసీమకు ఒరిగేమి లేదని, సీమ ప్రజలు డబ్బుల కోసం అమ్ముడుపోయే రకం కాదని చెప్పారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, లేనిపక్షంలో కనీసం గతంలో పోగొట్టుకున్న రాజధానినైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాయలసీమకు రాజధాని దక్కకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు మళ్లీ రాయల తెలంగాణను తెర పైకి తెస్తున్నారని మండిపడ్డారు. సీమను ముక్కలు చేయడానికి కావూరి ఎవరని ప్రశ్నించారు. కావాలంటే కోస్తాలోని గుంటూరు, కృష్ణా జిల్లాలను తెలంగాణలో కలుపుకోవాలని, సీమ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

దేశం నుంచి విడిపోతామన్న సీమాంధ్ర టిడిపి ఎంపీల వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకే వస్తాయన్నారు. అలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించాలన్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ జోకర్‌లా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారని మండిపడ్డారు. లగడపాటిని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా తన దగ్గర చివరి బంతి ఉందని మభ్యపెడుతున్నారన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకుని సీమ ప్రజలు కోస్తాంధ్రతో కలిసి ఉండలేరని, కనుక రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందని, ఒకవేళ వెనక్కి తగ్గితే ఆ పార్టీలో ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబును చూస్తేనే ప్రజలు ఓటేయరని, అలాంటి టిడిపితో పొత్తు పెట్టుకుంటే బిజెపికి శృంగభంగం తప్పదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+