బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత, ఇంటిలోనే దీక్ష (ఫోటోలు)

అమరావతి: రాయలసీమ పరిరక్షణ సమితి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన 'బతుకు దెరువు యాత్ర'కు పోలీసులు ఆటంకం కల్పించడంతో నందికొట్కూరు, పాణ్యం నియోజక వర్గాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, జూపాడుబంగ్లా మండలాల్లో పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టారు.

ఓర్వకల్లు, జూపాడుబంగ్లా మండలాల్లో భూ సేకరణ ద్వారా పరిశ్రమలకు సాగు భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా ప్రభుత్వం భూ సేకరణకు ముందుకు పోవడంతో బతుకు దెరువు యాత్ర పేరుతో ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామం నుంచి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేయాలని బైరెడ్డి నిర్ణయించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం తెల్లవారుజామున కర్నూలులోని తన ఇంటి నుంచి పూడిచెర్లకు బయలుదేరేందుకు సిద్ధపడిన సమయంలో ఆయన్ని అడ్డుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని పాదయాత్రకు ఉన్నాతాధికారుల అనుమతి లేదని స్పష్టం చేశారు.

తనను ఇంటిలోనే నిర్బంధించడంతో బైరెడ్డి ఇంటి వద్దనే దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ ఎంత కాలం తనను నిర్భంధిస్తారని ఏ రోజైనా తాను భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా బతుకుదెరువు పాదయాత్ర నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు.

బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

అంతక ముందు పోలీసుల తీరును ఆయన వ్యతిరేకిస్తూ తాను ప్రశాంతంగా పాదయాత్ర ద్వారా కలెక్టర్ కార్యాలయానికి చేరి వినతిపత్రం సమర్పిస్తానని తనను అడ్డుకోవద్దని పోలీసులను కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేసి ఇంటి గేటును మూసి వేశారు.

 బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

ఈ విషయం తెలిసి నగరంలోని బైరెడ్డి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నందికొట్కూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, పగిడ్యాల, ఓర్వకల్లు, గడివేముల మండలాల నుంచి పూడిచెర్లకు వస్తున్న ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు.

 బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

బైరెడ్డిని కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారన్న విషయం తెలిసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నందికొట్కూరు, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. బైరెడ్డి గృహ నిర్భంధం విషయం తెలిసి పెద్ద సంఖ్యలో కర్నూలులోని ఆయన ఇంటి వద్దకు అనుచరులు, ప్రజలు తరలివచ్చారు.

 బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

బైరెడ్డి 'బతుకు దెరువు యాత్ర' ఎందుకు: ఉద్రిక్తత

ఈ సందర్భంగా పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. బైరెడ్డిని విడుదల చేయడానికి అంగీకరించకపోడంతో ఆయన ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ బైరెడ్డి మద్దతుదారులు నినాదాలు చేశారు. ప్రశాంతంగా పాదయాత్ర చేసి కలెక్టర్‌కు తమ గోడు విన్నవించుకుంటామంటే అడ్డుకోవడం తగదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను నిర్భంధించడమంటే రైతులను నిర్భంధించడమేనని ఆయన అన్నారు. తద్వారా ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైనదిగా తనను తాను నిరూపించుకుంటోందన్నారు. భూములను సేకరించి రైతుల పొట్ట కొట్ట వద్దని తక్షణం ప్రభుత్వం తన చర్యను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఉన్న కొద్ది పాటి భూమి ప్రభుత్వం లాక్కుంటే పేద రైతుల, రైతు కూలీలకు బతుకు దెరువు నాశనమవుతుందని బైరెడ్డి అన్నారు. ఇప్పటికైనా భూ సేకరణను నిలిపివేస్తే తాను పాదయాత్ర విరమించుకుంటానని, లేని పక్షంలో పాదయాత్ర ఒక్కటే కాదు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆందోళన నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+