వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ఏర్పడుతోంది, మా సంగతేంటి?: బైరెడ్డి, జైపాల్‌తో జెడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విభజన తథ్యమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని, మరి మా సంగతేమిటని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురువారం అన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రాయలసీమ బైరెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం ధర్నాకు దిగారు.

రెండు రోజుల పాటు బైరెడ్డి దీక్ష చేయనున్నారు. ప్రత్యేక రాష్ట్రం కుదరకపోతే శ్రీ బాగ్ ఒప్పందం మేరకు కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమను, సీమ ప్రజల హక్కులను కాపాడాలన్నారు. సీమకు 200 టిఎంసిల నికర జలాలు కేటాయించాలని కోరారు.

Byreddy Rajasekhar Reddy

కూర్చొని మాట్లాడుకోవాలి: జెడి శీలం

రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల నేతలు కూర్చుని మాట్లాడుకోవాలని, అప్పుడే సమస్యకు పరిష్కారం వస్తుందని సీమాంధ్ర కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. అధిష్టానానికి తమ సమస్యలు చెప్పామని, వాటిని అంగీకరిస్తేనే విభజన సులభమవుతుందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని అన్నారు.

జెడి శీలం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం శీలం మాట్లాడుతూ... తెలుగువారికి జైపాల్ రెడ్డి సీనియర్ నాయకుడు అని, అందుకే కలిశానని చెప్పారు. మరోవైపు ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవిలు సమావేశమయ్యారు.

డిగ్గీతో మర్రి భేటీ

సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవిలు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. అనంతరం మర్రి మాట్లాడుతూ.. హైదరాబాదు యూటికి, రాయల తెలంగాణకు ఒప్పుకోమన్నారు. అసెంబ్లీలో సీట్ల పెంపు అంశాన్ని బిల్లులోనే పొందుపర్చాలని కోరినట్లు తెలిపారు. కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి చేరుకున్నారు.

English summary
Rayalaseema Parirakshana Samithi chief Byreddy Rajasekhar Reddy on Thursday begun his two days fast for justice to Rayalaseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X