సంతలో బేరం: బాబుపై బైరెడ్డి నిప్పులు, 'పురంధేశ్వరి కాంగ్రెస్ కోవర్టు'
కర్నూలు: సంతలో పశువులను బేరం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం మండిపడ్డారు. చంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.
రాష్ట్రంలో డబ్బున్నోడిదే రాజ్యమైందన్నారు. సమర్థవంతమైన పాలన అందించలేక ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, కోట్లాది రూపాయలు ఎరవేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారని, అతనికి ఏదో ఓ రోజు బుద్ధి చెబుతారన్నారు.

విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ నుంచి పాలన సాగించాలని ఉన్నప్పటికీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు రాజధానిని అమరావతికి మార్చారని ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ కోవర్టు
మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ కోవర్టు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామయ్య ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో పని చేసిన పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ కోవర్డుగా ఎన్డీయేలో పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన బిజెపి నేతల పైన బిజెపి అధిష్టానం దృష్టి సారించాలన్నారు.












Click it and Unblock the Notifications