అజ్ఞాతంలో బైరెడ్డి, బరిలో కూతురు, పార్టీ బాధ్యతలు

దీంతో పార్టీ వ్యవహారాలను కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి చూస్తున్నారు. ఆమె పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు అయిన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో పార్టీ తరఫున పలువురు అభ్యర్థులను ప్రకటించారు.
అంతేకాదు పార్టీని ఆమె ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. శబరి స్వయంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు. ఇంటింటికి వెళ్లి రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, పార్టీ ఏం చేయబోతుందని చెబుతున్నారు.
ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. శబరికి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. కొన్నేళ్లుగా రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న తన తండ్రిని కుట్ర పూరితంగా హత్య కేసులో ఇరికించారని ఆమె ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications