Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీకి 683 ఓట్లు వేసినందుకు థ్యాంక్యూ టీడీపీ అయ్యలూ

Pulivendula and Vontimitta ZPTC bypoll results: ఊహించినట్టే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 12వ తేదీన జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ పాగా వేసింది.

వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. మొత్తం 6,033 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి లతా రెడ్డి ఇక్కడ గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డి పరాజయాన్ని చవి చూశారు.

Byreddy Siddharth Reddy Delivers a Comedic Critique of TDP s Bypoll Fiasco on Pulivendula results

టీడీపీకి 6,716 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ విజయంతో 30 సంవత్సరాల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్టయింది. ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత హర్షం వ్యక్తం చేశారు. లతారెడ్డికి చంద్రబాబు ఫోన్ చేశారు. ఆమెను అభినందించారు.

పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరిందని అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సొంత గడ్డపై వైఎస్ఆర్సీపీ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిందని అన్నారు. పులివెందుల ప్రజలు జగన్‌పై ఎంత కసిగా ఉన్నారో ఈ విజయంతో అర్థమౌతోందని పేర్కొన్నారు. అవినీతి, అరాచకానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు.

అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలోనూ ఇదే ఫలితం వెలువడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని 6,267 ఓట్ల తేడాతో ఓడించారు. కృష్ణారెడ్డి కి 12,505 ఓట్లు పోల్ అయ్యాయి. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు పడ్డాయి.

ఈ ఉప ఎన్నికల ఫలితాల పట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సెటైర్లు వేశారు. పులివెందులలో తమ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు ఆయన ధన్యవాదాలను తెలియజేశారు.

టీడీపీ ఏజెంట్లకు కూడా తమ పార్టీపై ఇంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసిందని ఎద్దేవా చేశారు. పులివెందులలో 10,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించాలనుకున్నప్పటికీ.. అది తగ్గడం పట్ల టీడీపీ నాయకులు బాధపడుతున్నారని బైరెడ్డి చురకలు అంటించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు సక్రమంగా జరిగాయా?, రిగ్గింగ్ చేశారా? లేదా? అనేది అందరికంటే ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.

10,000 మంది ఓటర్లు ఉండే ఒక జెడ్పటీసీ స్థానం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, 800 మంది పోలీసులు, డీఐజీ, ఐజీ, ఎస్పీ, కలెక్టర్.. వీళ్లందరూ పనులన్నీ వదిలిపెట్టుకుని పులివెందులలో మకాం వేశారని చెప్పారు. ఒక జడ్పీటీసీ కోసం ఇంతమంది యంత్రాంగం పులివెందులలో దిగినప్పుడే.. వైఎస్ జగన్ ఎంత బలమైన నాయకుడో అర్థం చేసుకోవాలని అన్నారు.

పులివెందుల జడ్పీటీసీలో జగన్ అభ్యర్థిని ఓడించితే వైఎస్ఆర్సీపీ పని అయిపోతుందనుకోవడం టీడీపీ మూర్ఖత్వమని, నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా ఇదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. నంద్యాలలో వైసీపీని ఓడగొట్టినా, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచామని అన్నారు. అదే నంద్యాలలో 35 వేల మెజారిటీ వచ్చిందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+