తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం: షిండే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన సజావుగా సాగడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. న్యాయపరమైన, పరిపాలనాపరమైన అంశాలను మంత్రుల బృందం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి నిర్ణయానికి అనుగుణంగానే మంత్రి వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రకు అవసరమైన ప్యాకేజీ ఇస్తామని ఆయన చెప్పారు.

సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు సమకూరుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర వెనకబడిన ప్రాంతాలపై దృష్టిపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జివోఎం)ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాదుతో కూడిన తెలగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు షిండే తెలిపారు. తెలంగాణ నోట్‌పై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, పళ్లంరాజు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గం రెండు గంటల పాటు జరిగింది. కేంద్ర మంత్రుల బృందానికి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వం వహించే అవకాశం ఉంది. బృందం సభ్యులను కూడా ఆయన ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా నోట్‌ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడం పట్ల బిజెపి హర్షం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications