వైయస్‌ని చంద్రబాబు చంపించినట్టు కాదా: జగన్, కాల్ మనీలో 'సీఎం' సొమ్ము
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతల పైన హత్యాయత్నం కేసు పెట్టడంపై యువనేత తీవ్రంగా స్పందించారు.
గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని హెచ్చరిస్తూ... నీవు ఈసారి అసెంబ్లీలో అడుగుపెడితే కదా అని చంద్రబాబాబు అన్నారని, అది జరిగిన రెండు రోజులకే వైయస్ దుర్మరణం పాలయ్యారని, దాని అర్థం వైయస్‌ను చంద్రబాబు చంపినట్లు కాదా జగన్ ప్రశ్నించారు.
వైయస్ మృతి వ్యవహారంలో చంద్రబాబు పైన సీబీఐ విచారణ ఎందుకు జరపలేదన్నారు. లంచాలు తీసుకుని బాక్సైట్ గనులకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలున్నా కేసులు పెట్టడం లేదన్నారు. ఈ వ్యవహారాలన్నింటిలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.

కాల్ మనీలో చంద్రబాబు ఆయన మంత్రుల డబ్బు ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు తమను ఎన్నోసార్లు వేలు చూపిస్తూ నీ అంతు చూస్తానని చెప్పాడని, అలా అయితే మా అందర్నీ చంపేస్తామనే కదా అర్థం అన్నారు. ఆయన పైన హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టడం లేదన్నారు.
తణుకులో కాల్ మనీ బాధితుడు ఆత్మహత్య
తణుకులో కాల్ మనీ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు నాగరాజుగా తెలుస్తోంది.
కాల్ మనీపై పూర్తి స్వేచ్చను ఇచ్చిన ప్రభుత్వం
కాల్ మనీ విషయంలో ఏపీ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో, పోలీసులు చాలాచోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. టిడిపి నేతలను కూడా పోలీసులు వదలడం లేదు. బెజవాడలోనే 92 ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications