కాల్ మనీ స్కామ్: కింగ్‌పిన్‌ను పట్టించిన సీక్రెట్ కెమెరా
విజయవాడ: కాల్ మనీ కుంభకోణం కీలక పాత్రధారిని సీక్రెట్ కెమెరా పట్టించింది. సీక్రెట్ కెమెరా సహాయంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రామును పట్టుకున్నారు. అపారెల్ డిజైనర్ అయిన ఓ మహిళ కాల్ మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసింది.
ఆ బాధితురాలి ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ అధికారులు రాముకు చెందిన ఓ కార్యాలయంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారు. రాము లావాదేవీలన్నీ ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు రామును అరెస్టు చేశారు. రాము కార్యాలయం ఎల్లవేళలా సందర్శకులతో, వడ్డీకి అప్పులు తీసుకునేవారితో బిజీగా ఉంటుందని అంటారు.

రాముకు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, దీంతో రాము కార్యాలయంపై దాడులు చేయడానికి పటమట సిఐ నిరాకరించాడని, దాంతో ఆయనను సెలవుపై పంపించారని అంటున్నారు. టాస్క్‌పోర్స్ పోలీసులు చివరకు దాడులు చేసి రామును పట్టుకున్నారు.
అయితే, 35 ఏళ్ల అపారెల్ డిజైనర్, కాల్ మనీ బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ వ్యవహారమంతా వెలుగు చూసిందని అంటున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications