విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు ఎదురైన అనూహ్య అనుభవం: కాల్ మనీ బాధితుల ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంగళవారంనాడు అనుకోని అనుభవం ఎదురైంది. రాష్ట్రస్థాయి పుష్ప, ఫల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎదుట కాల్ మనీ బాధితులు ఆందోళనకు దిగారు.

తెలుగుదేశం పార్టీ నేతలే కాల్ మనీ వ్యాపారులుగా మారి వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బంధువుల నుంచి రక్షణ కల్పించాలని వారు నినాదాలు చేశారు. బాధితుల ఆందోళనతో చంద్రబాబు కాస్తా ఇబ్బందికి గురయ్యారు.

Pics: నారా లోకేష్ జిహెచ్ఎంసి ప్రచారం ; ఈ రోజు కార్టూన్

సభలో అల్లరి చేయవద్దని ఆయన సూచించారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆయన చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాల్ మనీ బాధితుల నుంచి చంద్రబాబు వినపత్రాలు తీసుకున్నారు. చంద్రబాబు ఎదుట నినాదాలు చేసిన శివరామ్ అనే యువకుడిని ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Call money victims stages dharna in front of Chandrababu

విజయవాడలో కాల్ మనీ కుంభకోణం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కాల్ మనీ వ్యాపారులు రకరరకాలుగా అప్పులు తీసుకున్నవారిని ఇబ్బందులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాల్ మనీ బాధితులు మంగళవారంనాడు ఆందోళనకు దిగారు.

ప్రకృతి వ్యవసాయం వినూత్న ప్రయోగం

ప్రకృతి వ్యవసాయం ఒక వినూత్న ప్రయోగమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో జరిగిన ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఆహార ధాన్యాల కోసమే ప్రపంచం ఎదురు చూస్తోందని, ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను పొందే సదుపాయం ప్రకృతి వ్యవసాయంలోనే ఉందని అన్నారు. సేద్యంలో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. ప్రకృతి సేద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సుభాష్‌ పాలేకర్‌ను ఆయన అభినందించారు. పద్మశ్రీతో కేంద్రం గౌరవించినందుకు పాలేకర్‌ను ప్రభుత్వం తరఫున చంద్రబాబు సన్మానించారు.

English summary
Call Money victims staged dharna in front of Andhra Pradesh CM Nara Chandrababu Naidu at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X