మందు తాగి కారుతో యువతి వీరంగం: ముగ్గురు మృతి

నెల్లూరు: జిల్లాలోని హరినాథపురం శివారులో ముత్తుకూరు రోడ్డు వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ బీభత్సం సృష్టించింది. ముత్తుకూరు వైపు వెళుతున్న ఆమె కుడివైపు డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా ఉన్న రెండు కార్లు, 4 మోటారు బైక్‌లను ఢీకొట్టింది.

తర్వాత ఆ ప్రక్కన వెళుతున్న విద్యార్థులపైకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు.

Car accident: Three killed in Nellore district

మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాద ఘటననను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ విషయం సోమవారం ఉదయం జిల్లాలో కలకలం సృష్టించింది.

ఆ యువతి గతంలో కూడా పల్సర్ వాహనాన్ని నడిపి పలు ప్రమాదాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కారు కొని అతి వేగంగా నడుపుతూ ప్రమాదం చేసింది. ప్రస్తుతం ఆ యువతి ఎక్కడ ఉందన్న విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+