వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెనాలిలో కరోనా పేషెంట్ పై.. అతని తండ్రితోపాటు పలువురిపై కేసు నమోదు ... రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా బాధితుడిపై తొలి కేసు నమోదు అయ్యింది . తెనాలిలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలతో కరోనా పేషంట్ తో పాటు అతని తండ్రిపై , వారికి సహకరించిన లారీ ఓనర్, డ్రైవర్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు . లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకే వారి మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే..

ఏపీలో వలస కార్మికుల తరలింపు చర్యలు మృగ్యమేనా ? తిరుగుబాటు అందుకేనా ?ఏపీలో వలస కార్మికుల తరలింపు చర్యలు మృగ్యమేనా ? తిరుగుబాటు అందుకేనా ?

కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో జనజీవనం స్తంభించింది . ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఇంటికే పరిమితమై ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ సమయంలో చాలా మంది వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న తమ వారిని తీసుకు రావటం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుని లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు . ఇక ఈ క్రమంలోనే లాక్ డౌన్ నిబంధనలు పాటించనందుకు వారిపై కేసు నమోదు చేసారు. తెనాలిలోని ఐతా నగర్ కు చెందిన ఓ యువకుడు చెన్నైలోని ఓ హోటల్ లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కు తెనాలి నుంచి ఓ లారీ వెళ్లగా, లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ను తన కుమారుడికి ఇచ్చిన అతని తండ్రి ఆ లారీలో కుమారుణ్ణి తెనాలికి రప్పించాడు.

Case against Corona Patient in Tenali... This is the reason

అయితే అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో అతను ఎక్కడి నుండి వచ్చాడు , ఎలా వచ్చాడు తెలుసుకున్న అధికారులు వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు . ఇక అతడిని ఐసొలేషన్ కు తరలించారు. జరిగిన విషయాన్ని స్థానిక ఏఎన్ఎం పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా లాక్ డౌన్ నిబంధనలు ఉలంగించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని వారిపై కేసు నమోదు చేసారు. కరోనా బాదితుదిపై, అలాగే అతని తండ్రిపై , అక్రమంగా అతన్ని తీసుకురావటానికి సహకరించిన లారీ డ్రైవర్ , ఓనర్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు .

English summary
The first case of corona victim has been registered in AP. Police have registered a case against Corona Patient and his father, and lorry Owner and driver, for allegedly causing the corona outbreak in Tenali. A case has been filed against them for violating lockdown rules
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X