అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు షాక్: ఆయనతోసహా ఆరుగురిపై కేసు నమోదు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూటమి తరపున ఎన్నికలబరిలోకి దిగిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన పోలీస్ కేసు నమోదయింది. ఓ టైల్స్ షాపు యజమాని వద్దకు జిఎస్టి సక్రమంగా కట్టడం లేదని డిఆర్ఐ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్న క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అధికారులను బెదిరించారని సీఎం రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఎం రమేష్ తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థిపై కేసు
సీఎం రమేష్ తో పాటుగా చోడవరం టిడిపి అభ్యర్థి కె ఎస్ ఎన్ ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణ తో పాటుగా మరో ఇద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. డి ఆర్ ఐ అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో, డి ఆర్ ఐ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది.

case filed on Anakapalli MP candidate CM Ramesh and chodavaram tdp candidate and others

మొత్తం ఆరుగురిపై పలు సెక్షన్లలో కేసు
ఏపీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఎం రమేష్ తో పాటుగా మరో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. ipc సెక్షన్ 143, 506, 342, 353, 201, 188, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు, ఓటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్టు కేసులు నమోదు చేశారు.

టీడీపీ వెర్షన్ ఇలా
అంతేకాదు విధుల్లో ఉన్న డీఆర్ఐ అధికారులకు ఆటంకం కలిగించి, వారిపై బెదిరింపులకు పాల్పడినట్లు వీరిపై కేసులు నమోదు చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు టైల్స్ వ్యాపారిపై విప్ కరణం ధర్మ శ్రీ వేధింపులకు దిగారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని డి ఆర్ ఐ అధికారులతో వ్యాపారి దుకాణంపై దాడులు చేయించారన్నారు.

టీడీపీకి మద్దతు పలికితే అధికారులతో దాడులా?
25 లక్షల రూపాయలు సీజ్ చేయించారని సీఎం రమేష్ తో పాటుగా టిడిపి నేతలు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో టైల్స్ షాపు నిర్వహిస్తున్న బుచ్చిబాబు టిడిపికి మద్దతు పలకడం వల్లే, అతని దుకాణంపై అధికారులు దాడులు చేశారని, ఈ క్రమంలోనే తాము అధికారులను ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. వైసిపి కక్షపూరితంగా పార్టీల నేతలపై కేసులు పెట్టిస్తుందని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+