జేసీ ప్రభాకర్ రెడ్డిపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు.. కారణమిదే!!
అనంతపురం జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టిడిపి సీనియర్ నేత జెసి ప్రభాకర్ రెడ్డి అక్కడ వైసిపి విధానాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న వివిధ రకాల నిరసన కార్యక్రమాలు ఎప్పుడు వార్తల్లోనే ఉంటాయి. ఇక తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టిడిపి సీనియర్ నేత జెసి ప్రభాకర్ రెడ్డిపై యాడికి, తాడిపత్రి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు పోలీసులు.
జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసులు నమోదు చేసేలా అసలు ఆయన ఏం చేశారంటే.. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఇసుక ట్రాక్టర్ల టైర్లకు జెసి ప్రభాకర్ రెడ్డి గాలి తీసి డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదుల మేరకు ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఆయనపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.

యాడికి మండలం రాయల చెరువు గ్రామం వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక టిప్పర్ కు అడ్డుగా వచ్చి ఇనుప చువ్వతో టైర్లు పంచర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు పెట్టారని గుంతకల్ కు చెందిన చాకలి నరసింహులు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో యాడికి పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులపై సెక్షన్ 341 సెక్షన్ 427 506 r/w 34 ఐపిసి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామం వద్ద కూడా ఇసుక ట్రాక్టర్ కు గాలి తీసి తనపై మున్సిపల్ చైర్మన్ మరికొంతమంది సభ్యులతో కలిసి దాడికి పాల్పడ్డాడని భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదు చేశారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 341, సెక్షన్ 324, సెక్షన్ 354, 506r/w నాలుగు ఐపిసి మరియు సెక్షన్ 3 (1)(r)(s) ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై ఒకేసారి రెండు కేసులు నమోదైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications