ఓటుకు నోటు: వాయిస్ శాంపిల్స్ ఇబ్బందే, ఖచ్చితమైన పదాలు కావాలా?
అమరావతి: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిస్ శాంపిల్స్ కోసం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు వాయిస్ శాంపిల్స్ కోసం అసెంబ్లీలో, బహిరంగ సమావేశాల్లో మాట్లాడిన ఆయన వాయిస్ రికార్డులు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది.
అయితే, అసెంబ్లీలో లేదా బహిరంగ సమావేశాల్లో ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు తీసుకుంటే సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.
టేపుల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో మాట్లాడింది చంద్రబాబు అనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిస్ స్పెక్టోగ్రాఫ్స్ కోసం టేపులో ఏదైతే ఉందో ఖచ్చితమైన పదాలు కావాలని అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ, వాయిస్ టెస్ట్ కోసం అనుమానితుడిగా ఉన్న వ్యక్తులు సహకరించకుంటే అప్పుడు అసెంబ్లీ రికార్డులు లేదా బహిరంగ సమావేశాల్లో మాట్లాడిన వాటిని తీసుకొని పోల్చుకోనున్నారు.
వాయిస్ టెస్ట్ కోర్టు ఆదేశాల మేరకు చేయనున్నారు. నిందితుడు లేదా అనుమానితుడు వాయిస్ టెస్ట్‌కు ఓకే చెబితే ఫరవాలేదని, ఇవ్వకుంటే అనుమానాలు మరింత పెరుగుతాయని అంటున్నారు.
రేవంత్ రెడ్డిని కలిసిన మోత్కుపల్లి నర్సింహులు
చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం మధ్యాహ్నం కలిశారు.












Click it and Unblock the Notifications