కరోనా సంక్షోభంలోనూ వదలని 'కులం'... ఐక్యంగా ఉండాల్సిన సమయంలో అడ్డు గోడలు...
ఒకసారి ఐక్యరాజ్య సమితి(UNO) వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే హోమ్ పేజీలో 'వన్ మినట్ వన్ సర్వే' అని ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే... కొన్ని ప్రశ్నలు, వాటికి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ సమాజం ఏయే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి.. అన్నది అందులో ఓ ప్రశ్న. దాని కిందే 'ప్రజలు,దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం' అన్న ఆప్షన్ కనిపిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా 16-31ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్లు ఎక్కువగా ఎంచుకున్న ఆప్షన్లలో ఇది రెండో స్థానంలో ఉంది. దాదాపు 15,252 మంది యువత దీనికి ఓటేశారు. తద్వారా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలు,దేశాల మధ్య ఐక్యత మరింత అవసరమని చెప్పకనే చెప్పారు. ఓవైపు అంతర్జాతీయ సమాజపు ఆలోచనా ధోరణి ఇలా ఉంటే... భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సీన్ కనిపిస్తోంది.

కుల సంఘాల ఆధ్వర్యంలో...
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకల కొరత తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. అదే కుల క్వారెంటైన్ సెంటర్స్. అంటే ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో తమ కులాల వారిని మాత్రమే అనుమతించే క్వారెంటైన్ కేంద్రాలు. ఇలా రెడ్డి క్వారెంటైన్ సెంటర్, కాపు క్వారెంటైన్ సెంటర్,కమ్మ క్వారెంటైన్ సెంటర్,వైశ్య క్వారెంటైన్ సెంటర్,రాజు క్వారెంటైన్ సెంటర్స్ పుట్టుకొచ్చాయి.

బలమైన సామాజికవర్గాలే...
కుల సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఈ క్వారెంటైన్ కేంద్రాల పేర్లను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఇవన్నీ బలమైన సామాజిక వర్గాలకు చెందినవే. అయితే ఇలా కులాల వారీగా క్వారెంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసే కొత్త ట్రెండ్ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టుకొచ్చింది కాదని... దీని మూలాలు ఉత్తరాదిలో ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అక్కడ అగర్వాల్స్.. జైన్స్... ఇతర బలమైన సామాజికవర్గాల వారు ఎవరి కులానికి వారు క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ క్వారెంటైన్ కేంద్రాల్లో వైద్య సదుపాయంతో పాటు,చౌక ధరలో ఆక్సిజన్ సౌకర్యాన్ని అందిస్తున్నారు.

కుల తత్వం ఏమీ లేదంటున్న నిర్వాహకులు...
ఇతర కులాలకు చెందినవారెవరైనా... తెలిసో తెలియకనో ఈ క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్తే... పడకలు లేవని చెప్పి పంపిస్తున్నారు. ఆయా సామాజికవర్గాల్లో ఆర్థికంగా కలిగినవాళ్లు ఈ క్వారెంటైన్ కేంద్రాలకు ఫండింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కాలంలో తమ కులం వాళ్లను కాపాడుకోవాలనే ఈ తపన చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇందులో కుల తత్వం ఏమీ లేదని... మానవత్వంతో తమవాళ్లను కాపాడుకునే ప్రయత్నమే తప్ప మరో ఉద్దేశం లేదని వీటి నిర్వాహకులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.

కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలోనే....
భారత్‌లో కుల సమస్య ఈనాటిది కాదు. కరోనా కాలంలోనూ దాని జాడ్యాన్ని ప్రజలు వదిలించుకోవట్లేదు. భారత్‌లో ప్రతీది కులంతోనే ముడిపడి ఉంటుందన్న అభిప్రాయాలకు జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. భారత్‌లో కరోనా మొదలైన కొత్తలోనే.. కులాల సమస్య పుట్టుకొచ్చింది. ఈ ఏడాది మే నెలలో జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ క్వారెంటైన్ కేంద్రంలో ఆశ్రయం పొందిన ఐదుగురు బ్రాహ్మణులు... అక్కడ దళితులు వండిన వంటను తినేందుకు తిరస్కరించారు. ఈ విషయాన్ని అక్కడి జిల్లా అధికారులు కూడా నిర్దారించారు. అంతేకాదు,ఆ ఐదుగురికి డ్రై రేషన్ కార్డులు ఇప్పించి సొంతంగా వంట చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఒక్క హజారీబాగ్‌లోనే కాదు... దేశంలోని పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.

అంతర్జాతీయ సమాజానికి భిన్నంగా....
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలు,దేశాలు మరింత సహాయ సహకారాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఐరాస వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.... భారత్‌లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సమస్త మానవాళిని కరోనా సంక్షోభం కమ్మేసిన వేళ... ఇంకా కుల ప్రాధాన్యత ఆలోచనలు మెదళ్లను వీడకపోవడం దాని తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే... కరోనా వ్యాక్సిన్ కోసం కూడా ఇలాగే కుల క్యాంపులు ఏర్పాటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications