మహిళను హతమార్చి.. మృతదేహంతో సంభోగం, ఎట్టకేలకు దొరికిన నిందితుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: పవిత్రమైన అయ్యప్పమాల వేసుకుని కూడా ఓ వ్యక్తి పాడుపనికి పాల్పడ్డాడు. తన కామవాంఛ తీర్చులేదన్న కోపంతో ఓ మహిళను దారుణంగా హతమర్చడమేకాదు, మృగం కన్నా హీనంగా ప్రవర్తించి ఆమె మృతదేహంతో కామవాంఛ తీర్చుకున్నాడు.

''నమ్మించి లోబరుచుకున్నాడు.. డబ్బులివ్వకపోతే ఫొటోలు నెట్‌లో పెడతానంటున్నాడు..''

ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఏమీ ఎరుగనట్లు తన దారిన తాను పోగా, చివరకు పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Caught up by Police - Man sex with Dead Body, after he murdered a woman

అసలేం జరిగిందంటే..

కంచికచర్లలో ఈ నెల 14న తమ్మిశెట్టి నర్సమ్మ గొట్టుముక్కల రోడ్డు ప్రణీత కాలనీ పరిసర ప్రాంతంలో మృతిచెంది ఉండగా కనుగొన్నారు. పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. స్థానిక రూరల్‌ సీఐ కార్యాలయంలో డీఎస్పీ రాధేష్‌ మురళి శుక్రవారం హత్య సంఘటన వివరాలను విలేకరులకు వివరించారు.

లారీ క్లీనర్‌తో వివాహేతర సంబంధం...

నందిగామ డీవీఆర్‌ కాలనీకి చెందిన గంటల కోటేశ్వరరావు కంచికచర్లలోని లారీ యజమాని కొండే వెంకట్రామయ్య వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న తమ్మిశెట్టి నర్సమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నెల 14న గొట్టుముక్కల రోడ్డులోని మద్యం దుకాణం వద్దకు నర్సమ్మతో కలిసివచ్చి కోటేశ్వరరావు మద్యం తాగాడు. అక్కడి నుంచి ఆమెను ప్రణీత కాలనీ పరిసర ప్రాంతాలలోకి తీసుకువెళ్లాడు. ఆమెతో తన కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు.

అయ్యప్పమాలలో ఉండగా...

అయితే కోటేశ్వరరావు ప్రయత్నానికి నర్సమ్మ అడ్డుచెప్పింది. పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకుని ఇలాంటి పనులు చేయకూడదంటూ ఆమె నిరాకరించింది. దీంతో కోటేశ్వరరావు ఆవేశంతో ఆమె మొహంపై రాళ్లు, పిడిగుద్దులతో కొట్టాడు. ఈ ఘటనలో నర్సమ్మ మృతి చెందగా, మద్యం మైకంలో ఆమె మృతదేహంతోనే కోటేశ్వరరావు తన కోరిక తీర్చుకున్నాడు.

పోలీసులు అనుమానించింది ఇలా..

ఇటీవల పోలీసులు పలు కూడళ్లలో, మద్యం షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక మద్యం షాపులో స్వామి మాలలో ఉన్న వ్యక్తిని సీసీ కెమెరాల్లో చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అనుమానంతో అతడిపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో.. కొద్దిరోజుల క్రితం కోటేశ్వరరావు నందిగామలోని ఒక మద్యం దుకాణం వద్ద ఒక వ్యక్తితో కబుర్లలో పడి... తన కోసం పోలీసులు తిరుగుతున్నారని, తాను ఓ మహిళను రేప్‌ చేసి హత్య చేశానని గొప్పలు చెప్పాడు. ఈ సమాచారాన్ని పోలీసు ఇన్‌ఫార్మర్‌ పోలీసు అధికారులకు చేరవేశాడు. శుక్రవారం నందిగామ డీవీఆర్‌ కాలనీలోని ఇంటిలో ఉన్న కోటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు.

సీసీ కెమెరాల సాయంతో...

కంచికచర్ల పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నిందితుడిని పోలీసులు గుర్తించగలిగారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నందిగామ రూరల్‌ సీఐ మూర్తి, ఎస్సై సందీప్‌ను డీఎస్సీ రాధేష్‌ మురళి అభినందించారు. కానిస్టేబుల్‌ రాము, కొండలు చాకచక్యంగా అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి వివరాలను సేకరించడం ద్వారానే ఈ కేసులో మిస్టరీని ఛేదించగలిగినట్టు చెప్పారు. కానిస్టేబుళ్లు ఇద్దరినీ అభినందించి నగదు బహుమతి అందచేశారు. గ్రామాల్లో కూడా దాతల సహాయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At last with the help of CC cameras police arrested a man who murdered a woman and raped the dead body here in Nandigama DVR Colony on Friday. The accused is a lorry cleaner and his name is Koteswar Rao. He has an illegal relation with the woman Narsamma who died in Koteswar Rao's cruel act near Praneetha Colony of Gottumukkala Road of Kanchikacherla.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి