మాజీ మంత్రి సుబ్బరాయుడిపై సిబిఐ చీటింగ్ కేసు
విశాఖపట్నం: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుపై సిబిఐ కేసు నమోదు చేసింది. సుబ్బరాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి నర్సాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి రూ. 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో సిబిఐ రంగంలోకి దిగింది.
కొత్తపల్లి సుబ్బరాయుడితో పాటు ఎస్బిఐ చీఫ్ మేనేజర్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. సిబిఐ అధికారులు అమలాపురం, భీమవరం, హైదరాబాద్లో తనిఖీలు నిర్వహించారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. మార్చి 10వ తేదీ నుంచి అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కమిషన్ పేర్కొంది. నామినేషన్ల గడువు 17న ముగుస్తుంది.
మార్చి 27న పోలింగ్ తోపాటు అదేరోజున ఓట్ల లెక్కింపు ఉంటుందని కమిషన్ తెలిపింది. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సందిగ్ధత నెలకొందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications