వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ క్విడ్ ప్రోకో కేసు: సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

పెన్నా సిమెంట్‌కు సంబంధించి ఏపీ సీఎం, వైఎస్ జగన్మోన్‌రెడ్డి క్విడ్ ప్రోకో కేసు విచారణ విషయంలో హైదరాబాద్ సీబీఐ కోర్టు తీసుకొన్న నిర్ణయం లీగల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విచారణను కేవలం కేసుకు సంబంధించిన ఇరు వర్గాల న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాలు తలుపులు మూసి రహస్యంగా (ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్) విచారణ జరుపాలని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జీ బీవీ మధుసూదన్ రావు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. జనవరి 10న ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు సంబంధించి మరింత సమాచారం...

ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్

ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్

పెన్నా సిమెంట్ కేసులో విచారణపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసు విచారణ జరిపేటప్పుడు రెండు పార్టీల న్యాయవాదులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే కోర్టు హాలులో ఉండాలి. కేసుకు సంబంధం లేని ఇతర న్యాయవాదులు, మిగితా వారు బయటకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తి బీవీ మధుసూదన్ రావు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణ సీక్రెట్‌గా కొంత మంది సమక్షంలోనే జరిగే అవకాశం ఏర్పడింది.

కీలకమైన కేసుల్లోనే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్

కీలకమైన కేసుల్లోనే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్

సాధారణంగా దేశ భద్రత, మానభంగాలు లాంటి సున్నితమైన కేసులను ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ విధానంలో విచారిస్తారు. అయితే క్విడ్ ప్రోకో కేసును ఈ విధంగా విచారించడంపై లీగల్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు అధికారులు, ప్రముఖులు ఎదుర్కోవడం వల్ల ఈ కేసు విచారణ ప్రజల దృష్టికి దూరంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కేసు విచారణ ఇలా

గతంలో కేసు విచారణ ఇలా

గతంలో ఈ కేసు విచారణకు సంబంధించిన వార్తలను పత్రికల్లో రాయకుండా గత న్యాయమూర్తి ఎం వెంకటరమణ నిరోధించారు. కానీ ఇన్‌కెమెరా ప్రోసిడింగ్స్‌ నిర్వహించాలని మాత్రం ఆయన నిర్ణయం తీసుకోలేదనే వాదన వ్యక్తమవుతున్నది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైన విషయాలను మీడియా కవర్ చేయడానికి అనుమతించారనే మాట మీడియా వర్గాల్లో వ్యక్తమైంది.

పెన్నా సిమెంట్ అభ్యంతరం

పెన్నా సిమెంట్ అభ్యంతరం

ఇదిలా ఉండగా, ఈ కేసులో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయడంపై పెన్నా సిమెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. మొదటి చార్జిషిట్‌ కంటే రెండో చార్జిషీట్‌లో పేర్కొన్న విషయాల్లో కొత్తవి ఏమీ లేదని పెన్నా తరఫు న్యాయవాదులు ప్రత్యేక న్యాయమూర్తికి విన్నవించినట్టు సమాచారం. కాబట్టి అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోకూడదని కోరడం జరిగింది.

10న పెన్నా అభ్యర్థనపై విచారణ

10న పెన్నా అభ్యర్థనపై విచారణ

క్విడ్ ప్రోకో కేసులో అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని పెన్నా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్లలో పలువురు రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు ఉండటంతో ఈ కేసు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నది.

English summary
CBI Court directed in camera proceedings In Penna Cement case. Court directed that only layers of both parties to be in the hall
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X