వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డి బెయిల్ రద్దు కేసు-సీబీఐ అనూహ్య నిర్ణయం : మెమోలో క్లారిటీ-గడువు కోరిన ఎంపీ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్లు ఇప్పుడు ఏపీలో కీలక అంశాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు సీబీఐ కోర్టులో వేసిన పిటీషన్ లో అటు పిటీషన్-జగన్ తరపు న్యాయవాదులు-సీబీఐ తమ వాదనలు వినిపించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకొనేందుకు ఈ నెల 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇక, ఇదే సమయంలో తన ఆర్దిక సంస్థల పైన..బ్యాంకు రుణాలు-ఆరోపణల పైన వైసీపీ పార్లమెంట్ సభ్యుల సంతకాలతో సాయిరెడ్డి నేరుగా రాష్ట్రపతి-ప్రధానికి ఫిర్యాదు చేయటం పైన రఘురామ రాజు రియస్ గా స్పందించారు.

 సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ..

సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ..

దీనికి ప్రతిగా అన్నట్లుగా జగన్ తరహాలోనే విజయ సాయిరెడ్డి బెయిల్ సైతం రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ముందుగా చెప్పి మరీ ఈ పిటీషన్ వేసారు. సీఎం జగన్ పైన దాఖలు చేసిన పిటీషన్ లో కీలక అంశాలు ప్రస్తావించిన రఘురామ రాజు...సాయిరెడ్డి పైన దాఖలు చేసిన పిటీషన్ లోనూ అదే విధంగా పలు అంశాలను పేర్కొన్నారు. ఈ పిటీసన్ పైన సీబీఐ కోర్టు విజయ సాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కాగా, పిటిషన్ పై కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ కోరింది.

 కోర్టు విచక్షణకే వదిలేసిన సీబీఐ..

కోర్టు విచక్షణకే వదిలేసిన సీబీఐ..

దీంతో, ఈ కేసు తిరిగి ఈ రోజు సీబీఐ కోర్టు ముందు విచారణకు వచ్చింది. పిటీషన్ లో పేర్కొన్న అంశాల పైన కౌంటర్ దాఖలు చేయాల్సిన సీబీఐ అనూహ్యంగా ఈ విషయంలో కోర్టు విచక్షణకే నిర్ణయం వదిలిపెడుతున్నట్లు వెల్లడించింది. న్యాయస్థానం విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోలో స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన మెమో పైన కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావాలని విజయ సాయిరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.

 సాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారు..

సాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారు..

దీంతో..కేసు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. విజయ సాయిరెడ్డి నేరుగా రఘురామ రాజు వ్యవహారాల పైన ఫిర్యాదులు చేయటంతో ..రఘురామ రాజు సైతం తాను దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు. అందులో కొన్ని ఆధారాలను ఉదహరించారు. రాజ్యసభ సభ్యుడుగా సాయిరెడ్డి కేంద్రంలోని హోం శాఖ తో పాటుగా పలు కీలక శాఖల్లోని మంత్రులతో తనకు క్లోజ్ రిలేషన్ ఉందనే విధంగా వ్యవహరిస్తూ..తన కేసుల్లోని సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.

 జగన్-సాయిరెడ్డి కేసల్లో సీబీఐ ఇదే విధంగా..

జగన్-సాయిరెడ్డి కేసల్లో సీబీఐ ఇదే విధంగా..

వారిని ప్రత్యక్షంగా-పరోక్షంగా అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పిటీషన్ లో వివరించారు. సాయిరెడ్డి కొన్ని సందర్బాల్లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అవన్నీ కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయంటూ అందులో పేర్కొన్నారు. అయితే, జగన్ బెయిల్ రద్దు కేసులో ఏ విధంగా సీబీఐ వ్యవహరించిందో ..ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తోంది. అప్పుడు-ఇప్పుడు న్యాయస్థానం విచక్షణకే నిర్ణయం వదిలేస్తూ మెమో దాఖలు చేసింది.

Recommended Video

Ys Jagan : గాంధీ జయంతి రోజునే సంచలనం.. ఇక ప్రజల్లోనే | Ys Jagan Cares || Oneindia Telugu
రెండు కేసులు ఏపీ రాజకీయాల్లో కీలకంగా..

రెండు కేసులు ఏపీ రాజకీయాల్లో కీలకంగా..

అయితే, జగన్ కేసులో ఈ నెల 25వ తేదీన తీర్పు వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఇప్పుడు విజయ సాయిరెడ్డి కేసులోనూ సీబీఐ అదే విధంగా కోర్టు విచక్షణకే వదిలేస్తూ మెమో దాఖలు చేయటంతో..దీని పైన విజయ సాయిరెడ్డి దాఖలు చేసే కౌంటర్ ను పరిశీలించిన తరువాత కోర్టు స్పందన కీలకం కానుంది. మొత్తానికి ఇప్పుడు సీఎం జగన్ - ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ల విచారణ రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారుతోంది.

English summary
CBI filed Memo in CBI court against Raghu Rama Rajus petition seeking vijay sai reddy's bail cancellation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X