అవినాశ్ బెయిల్ రద్దు చేయండి - సుప్రీంలో సీబీఐ పిటీషన్..!!
వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతా రెడ్డి సవాలు చేశారని ప్రస్తావించింది. దీంతో, ఇప్పుడు విచారణ సమయంలో సుప్రీం నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
సుప్రీంలో సునీత పిటీషన్ :వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్యకు దాడి చేసిన పరిణామాలు అనంతరం సాక్షాదారాల జరిపివేతలో నిందితులు పాల్గొన్న తీరును ప్రస్తావించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లకు వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని మరోసారి సిపిఐ పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించారని ఎప్పటికి వివరించింది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని షర్మిల విజయమ్మల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని వివేక పట్టుబట్టినట్టు వివరించింది.
సీబీఐ అఫిడవిట్ : దీన్ని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివ శంకర్ రెడ్డి భరించలేకపోయారని సిబిఐ చెప్పుకొచ్చింది. వివేక హత్యకు ఈ ముగ్గురే కుట్ర పన్నినట్లు హత్యా స్థలంలో లభించిన సాక్షాదారాలు చెబుతున్నాయని సిపిఐ వివరించింది. హత్య తర్వాత జరుగుతున్న పరిణామాల పై అప్రూవర్ గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసింది.

ఈ ముగ్గురి సమక్షంలోని చెరిపివేసినట్లు వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించింది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు మెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరుకావాలని షరతు విధించింది. ఈ మేరకు ప్రతివారం అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరవుతున్నారు.
సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ :కాగా, డాక్టర్ సునీత హైకోర్టు నిర్ణయం పైన సుప్రీం ఆశ్రయించారు. తన అభ్యంతరాలను వాదనలను కోర్టు ముందు ఉంచారు. వీటిని విన్న న్యాయస్థానం ఈనెల 11న ఈ కేసు విచారణకు నిర్ణయించింది అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దాఖలు చేసిన సిబిఐ ఈ మేరకు గతంలో ప్రస్తావించిన అంశాలనే మరోసారి ఈ కౌంటర్లో వివరించింది. దీంతో ఇప్పుడు విచారణ తర్వాత సుప్రీంకోర్టు అవినాష్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ మొదలైంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications