నా దగ్గర వ్యూహం ఉంది, ఆ అవసరం రావొద్దనుకుంటున్నా: లక్ష్మీనారాయణ
రాజమహేంద్రవరం: రైతు సమస్యల పరిష్కారానికి తన వద్ద ఓ వ్యూహం ఉందని, ఆ అవసరం రాకూడదని రాష్ట్రప్రభుత్వాన్ని తాను కోరుకుంటున్నానని, సమస్యలను పరిష్కరించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం అన్నారు.
చదవండి: చంద్రబాబును కలిసి ఇస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలపై..
వ్యవసాయ అంశం రాష్ట్రం పరిధిలోనిది అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో రైతు ఉద్యమం తర్వాత తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. ఏపీలో రైతులను అలాంటి దుస్థితిలో చూడాలనుకోవడం లేదన్నారు.

రైతు సమస్యలను పరిష్కరించకుంటే మహారాష్ట్ర తరహా ఉద్యమం ఏపీలోను రావాలన్నారు. అందుకు వ్యూహం ఉందని, ఆ అవసరం రావొద్దని భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాని చెప్పారు. కనీస మద్దతు ధర కోసం చాలా సీరియస్‌గా పోరాడాలన్నారు.
తనకు ఏ పార్టీతో సంబంధం లేదని ఆయన చెప్పారు. మన దేశంలో వ్యక్తిత్వ ఆరాధన కంటే వ్యక్తి ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాను రెండు ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దానని, పంచాయతీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు.
సోషల్ మీడియా ఎల్లప్పుడూ ఉపయోగకరమన్నారు. టెక్నాలజీని పప్పులో ఉప్పులా వినియోగించుకుంటే సాధ్యం కానిది ఉండదన్నారు. రాజకీయాల్లోకి రావడంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారన్నారు. విద్యార్థులు మంచి పుస్తకాలు చదవాల్నారు. మంచి వ్యక్తులను కలవాలన్నారు.












Click it and Unblock the Notifications