వివేకా హత్యకేసులో వారిద్దరి నుంచి కూపీ లాగుతున్న సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తోంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్ కోఠీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు లేఖ దాచి పెట్టడంపై ప్రకాష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పీఏ కృష్ణారెడ్డిని మంగళవారమే విచారించారు. మరోసారి కృష్ణారెడ్డి, ప్రకాష్ ను విచారిస్తున్నారు. లేఖను కృష్ణారెడ్డి ద్వారా ప్రకాష్ దాచిపెట్టాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి నుంచి సీబీఐ కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో దర్యాప్తు గత నెల 30వ తేదీతో ముగియాల్సి ఉండగా సమయం సరిపోదనే భావనతో సుప్రీంకోర్టు జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టి మరీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును సుప్రీం ధర్మాసనం తీవ్రస్థాయిలో మందలించింది.

తనకు తాను తప్పుగా అన్వయించుకొని అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వు ఇచ్చిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంపీని గతనెల 25వ తేదీవరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఉత్తర్వులను వివేకా కుమార్తు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో రాతపూర్వకంగా ప్రశ్నలివ్వాలని, వాటిని ముందస్తుగానే అందజేయాలని ఇచ్చిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం ఆక్షేపించింది. ఈ కేసు విషయంలోనే సీబీఐ విచారణకు ఇది ప్రామాణికమైతే సంస్థను మూసేయడం మేలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును భవిష్యత్తులో ఇతర నిందితులెవరైనా ఉదాహరణగా చూపిస్తే.. ఆ పరిస్థితి ఊహకే అందడంలేదన్నారు.












Click it and Unblock the Notifications