మోడీ మానసిక పరిస్థితి బాగాలేదని తెలుసు: బుద్ధా వెంకన్న, పవన్ కళ్యాణ్‌పై రాయపాటి
విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రధాని నరేంద్ర మోడీ మానసిక పరిస్థితి బాగాలేదని దేశం మొత్తం తెలుసునని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శుక్రవారం చెప్పారు. సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రధాని నరేంద్ర మోడీ జేబు సంస్థగా మారిందని విమర్శించారు.
దేశంలో ప్రధాని మోడీ నియంతలా మారారని విమర్శించారు. సీబీఐ దర్యాఫ్తులకు భయపడి బీజేపీలో చేరిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని ఎద్దేవా చేశారు. ప్రజలకు పనికి వచ్చే పనుల పైన విపక్షాలు పోరాటం చేయాలని సూచించారు.

అంతకుముందు, ఎంపీ రాయపాటి సాంబశివ రావు కూడా కన్నా పైన విమర్శలు గుప్పించారు. కన్నా లక్ష్మీనారాయణ అత్యంత అవినీతిపరుడన్నారు. కనీస పరిజ్ఞానం లేని నేతలు పోలవరం ప్రాజెక్టు పైన నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారన్నారు. ఆ బాధ్యతలు అందరూ సక్రమంగా నిర్వర్తించలేరని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు తెలంగాణ వరకే పరిమితమన్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications