అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు జడ్డీలపై మళ్లీ పోస్టుల ప్రమాదం-నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ-తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టు వెలువరించిన పలు తీర్పుల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో హైకోర్టు విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన పలువురుప నిందితులు బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నారు. వీరికి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై విచారణ జరిపిన హైకోర్టుకు సీబీఐ చేసిన అభ్యర్ధన ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వాదన విన్న తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదావేసింది.

 హైకోర్టు జడ్డీలపై పోస్టులు

హైకోర్టు జడ్డీలపై పోస్టులు


ఏపీలో హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిలో ఆరుగురు వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల్ని సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. వీరిలో అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, కిశోర్ కుమార్ రెడ్డి, అజయ్ అమృత్, సుస్వరం శ్రీనాథ్ ఉన్నారు. విదేశాల్లో ఉన్న పంచ్ ప్రభాకర్ వంటి మరికొందరిని ఇంకా సీబీఐ అరెస్టు చేయాల్సి ఉంది. ఈ కేసు విచారణ ఓవైపు సాగుతుండగానే.. అరెస్టైన నిందితుల్లో కొందరు బెయిల్ కోసం హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకూ తమకు బెయిల్ ఇవ్వకుండా ఆపడం సరికాదన్నది వారి వాదన. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇప్పటికే ఓసారి బెయిల్ తిరస్కరించింది. దీంతో వీరు మరోసారి అప్పీలు చేసుకున్నారు.

సీబీఐ కీలక వాదనలు

సీబీఐ కీలక వాదనలు


జడ్జీలపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీబీఐ అరెస్టు చేసిన నిందితులు బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆరుగురు నిందితులు మరోసారి హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఇందులో భాగంగా సీబీఐ తన వాదనను వినిపించింది. ఈ కేసు దర్యాప్తును నత్తనడకన చేపడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ... హైకోర్టులో మాత్రం ఈసారి నిందితుల బెయిల్ పై పదునైన వాదన వినిపించింది. దీంతో నిందితుల బెయిల్ పై హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారిపోయింది.

బెయిల్ ఇస్తే మళ్లీ పోస్టులు పెడతారన్న సీబీఐ

బెయిల్ ఇస్తే మళ్లీ పోస్టులు పెడతారన్న సీబీఐ


జడ్డీలకు వ్యతిరేకంగా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి హైకోర్టు ఇప్పుడు బెయిల్ ఇస్తే తిరిగి నిందితులు పోస్టులు పెట్టే అవకాశం ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే తప్పుడు పేర్లతో సైతం హైకోర్టు జడ్డీలపై ఇప్పటికీ పోస్టులు పెడుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ వేర్వేరు పేర్లతో పోస్టులు పెట్టే ప్రమాదం ఉందని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో పిటిషనర్లతో పాటు సీబీఐ వాదనలు విన్న హైకోర్టు.. తన తీర్పును రిజర్వు చేసింది.

English summary
the cbi has opposed bail to accused in social media posts against judges case in high court with various reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X