జగన్ పార్టీ రెబల్ ఎంపీ కొత్తపల్లి గీతపై కేసు, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ఛాన్స్..?
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినట్లు గీతపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై విచారణ జరిపేందుకు సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది.

గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఎంపీ కొత్త పల్లి గీత వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ42.79 కోట్లు నష్టం వాటిల్లందని చార్జిషీట్ పేర్కొంది. ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి.
తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్దేశ పూర్వకంగా బ్యాంకుని మోసం, వంచన చేయడం లాంటి ఆరోపణలతో వీరిపై ఐపీసీలోని 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. త్వరలో ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందటున్నారు.












Click it and Unblock the Notifications