కృష్ణా కాల్పులు: ముంబై ప్రొఫెషనల్ కిల్లర్సేనా(పిక్చర్స్)

విజయవాడ: కృష్ణా జిల్లాలో కారులో వెళ్తున్న ముగ్గురిని ప్రత్యర్థులు బుధవారం కాల్చి చంపిన విషయం తెలిసిందే. పోలీసులు దీని పైన విచారణ జరుపుతున్నారు. బుధవారం ఉదయం పది గంటల సమయంలో చెన్నై-కలకత్తా జాతీయ రహదారి పైన విజయవాడ సమీపంలోని పెదఅవుటపల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ కాల్పుల్లో వారి తల, మెడ, ఛాతి, భుజం, మోచేయి, తొడలోకి బుల్లెట్లు దూసుకుపోవటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరోవ్యక్తి హాస్పటల్‌కు తీసుకెళ్లే సమయంలో మృతి చెందాడు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పెద వేగిమండలం పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్కులు గంథం నాగేశ్వరరావు, ఆయన ఇరువురు కుమారులు మారయ్య, పగిడి మారయ్యలు కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయని పోలీసులు నిర్థారిస్తున్నారు.

 CC tv footage to play key role in murder case in Krishna district

ముంబై నుంచి బుధవారం ఉదయం గంథం మారయ్య, పెదమారయ్యలిద్దరూ వస్తున్నారనే సమాచారం హంతకులకు ముందుగానే అందింది. ఏ కారులో వస్తారు? ఎంతమంది ఉంటారు? ఏ ప్రదేశంలో వారిని హతమార్చవచ్చు? ఎలా హతమార్చాలి తదితర వివరాలపై హంతకులు ముందుగానే ప్రణాళికలు వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ముంబై నుంచి వచ్చిన ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ పగడ్భందీగా ఈ మారణకాండను సాగించినట్లు వారు అనుమానిస్తున్నారు. హంతకులు ఉపయోగించిన మహీంద్ర ఎక్స్‌యూవీ500(ఏపీ 20ఏఎల్‌ 5432) వాహనం బుధవారం ఉదయం 7:20 నిమిషాలకు ఏలూరు నుంచి గన్నవరం వైపు వచ్చినట్లు పొట్టిపాడు టోల్‌గేట్‌ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీనిని బట్టి హంతకులు గంథం నాగేశ్వరరావు కంటే ముందుగానే ఏలూరు నుంచి గన్నవరం సమీపంలోకి చేరుకుని, రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

దుండగులు మొత్తం మూడు తుపాకులతో నాగేశ్వరరావు, మారయ్య, పగిడిమారయ్యలను హతమార్చినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో మొత్తం ఆరు బుల్లెట్‌ షెల్స్‌ను, రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. పాయింట్‌ 32 పిస్టల్స్‌ 7.65(బాల్‌స్టిక్‌) బుల్లెట్లను ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ 7.65 బుల్లెట్లను టూ ఇన్‌ వన్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉందని, కంట్రీమేడ్‌ తుపాకుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారని వారు తెలిపారు. కాగా, ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ పాత్ర కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+