చంద్ర‌బాబు తో సీఈసీ సై : ఇవియం ల పై చ‌ర్చ‌కు సిద్దం : ఆయ‌న ను అనుమ‌తించం..!

టిడిపి అధినేత చంద్ర‌బాఢిబు చేస్తున్న ఆరోప‌ణ‌ల పై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిం ది. ఇవియం లు మేనేజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని..ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ‌కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చంద్ర‌బా బు ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ఢిల్లీ వేదిక‌గా ఈవియం ల పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు..స్పందించిన సీఈసీ వీటి నిర్వ‌హ‌ణ పూ చ‌ర్చ కు సిద్ద‌మ‌ని..అందుకు రావాల‌ని ఆహ్వానించారు.

చంద్ర‌బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు..

చంద్ర‌బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు..

ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో ఇవియం ల పై త‌లెత్తిన సాంకేతిక ఇబ్బందుల పై చంద్ర‌బాబు రెండు రోజులుగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించా ర‌ని ఆరోపించారు. అదే స‌మ‌యంలో ఇవియం లు ప్ర‌జాస్వామ్యానికి ముప్పు అని..బ్యాలెట్ విధానాన్ని పు న‌రుద్ద రించాల‌ని డిమాండ్ చేసారు. చిప్ ఆధారిత ఇవియం ల ద్వారా ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌లేమ‌ని వివ‌రించారు. ఇవియం ల తో పాటుగా వివి ప్యాట్స్ ను 50 శాతం లెక్కించాల‌ని డిమాండ్ చేసారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసి సుదీర్ఘంగా చ‌ర్చించిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు త‌న సందేహాల‌తో ఓ లేఖ అందించారు. త‌న అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని డిమాండ్ చేసారు.

ఆరోప‌ణ‌ల పై చ‌ర్చ‌కు సిద్దమ‌న్న ఈసీ..

ఆరోప‌ణ‌ల పై చ‌ర్చ‌కు సిద్దమ‌న్న ఈసీ..

ఈవీఎంల పైనా..ఎన్నిక‌ల సంఘం పైనా చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల పై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. చంద్ర‌బాబు ఇచ్చిన లేఖ కు స్పంద‌న‌గా టిడిపి అధినేత కు సీఈసీ లేఖ రాసారు. అందులో చంద్ర‌బాబు లేవ‌నెత్తిన అనుమానాల‌కు స‌మాధానం ఇచ్చారు. ఈవీయం ల పై నిపుణుల‌తో చ‌ర్చించేందుకు సిద్ద‌మ‌ని స్ప‌ష్టం చేసారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు త‌మ కార్యా ల‌యానికి రావాల‌ని కోరారు. అయితే, టిడిపి త‌ర‌పున హ‌రిప్ర‌సాద్ ను చ‌ర్చ‌లో పాల్గొన‌టం పై సీఈసీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈవీఎం వ్య‌వ‌హారంలో హ‌రి ప్ర‌సాద్ పై క్రిమిన‌ల్ కేసు న‌మోదైనందున అలాంటి వారి తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. హ‌రి ప్ర‌సాద్ కాకుండా ఇత‌ర సాంకేతిక నిపుణు ల‌తో చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా లేఖ‌లో స్ప‌ష్టం చేసారు.

ఏపి ప‌రిణామాల పైనా సుదీర్ఘ చ‌ర్చ‌..

ఏపి ప‌రిణామాల పైనా సుదీర్ఘ చ‌ర్చ‌..

కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి సునీల్ అరోరా తో సుదీర్ఘంగా స‌మావేశ‌మైన చంద్ర‌బాబు ఏపిలో జ‌రిగిన ప‌రిణామాల పై వివ‌రించారు. ఎన్నిక‌ల సంఘం అధికారుల బ‌దిలీ విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాల పై అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తో సంప్ర‌దించుకుండా.. అధికారుల నుండి వివ‌ర‌ణ లేకుం డా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటారని ప్ర‌శ్నించారు. తాము వైసిపి పై ఇచ్చిన ఫిర్యాదుల పై ఎందుకు స్పందించ‌లేద‌ని నిల‌దీసారు.ఈవీఎంల నిర్వ‌హ‌ణ లో పూర్తిగా ఎన్నిక‌ల సంఘ అధికారులు విఫ‌ల‌మయ్యార‌ని..మీకు ఓట‌ర్లు భిక్ష‌గాళ్ల‌లా క‌నిపిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. దీనికి స్పందించిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పూర్తి స‌మాచారం సేక‌రిస్తామ‌ని..ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇవియం ఈవీఎంపై బాబు అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు చ‌ర్చ కు రావాల‌ని ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+