జగన్ కు ఈసీ షాక్; ఎన్నికల వేళ మరో ఐపీఎస్, సిట్ అధికారి బదిలీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ సిఐడి అధికారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఆరోపణల రచ్చ కొనసాగుతున్న వేళ, సిట్ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డిని బదిలీ చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఏపీలో అనేకమంది భారీగా ఐఏఎస్ లఏ, ఐపీఎస్ ల బదిలీని చేపట్టింది. ఇక ఇదే సమయంలో తాజాగా ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సీనియర్ ఐపీఎస్ ,సిట్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ని బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. కొల్లి రఘురామిరెడ్డి ని ఏపీ నుంచి బయటకు పంపిన ఎన్నికల సంఘం ఆయనను అస్సాం ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ గా నియమించింది. కొల్లి రఘురామిరెడ్డి ని అస్సాంలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీస్ పరిశీలకుడిగా నియమించిన ఈసీ, ఆయన గౌహతి కేంద్రంగా ఉంటూ విధులు నిర్వర్తించాల్సిందిగా పేర్కొంది.

ఏపీలో కీలక అధికారిగా కొల్లి రఘురామి రెడ్డి
అయితే రఘురామి రెడ్డి రాష్ట్రంలో రాజధాని భూములపై దర్యాప్తుకు వేసిన సిట్ బృందాన్ని లీడ్ చేస్తున్నారు. ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు చేసిన అధికారి కూడా రఘురామిరెడ్డి నే. కొల్లి రఘురామిరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఔషధ నియంత్రణ మండలి డీజీగా కూడా ఆయన ఉన్నారు.
తాజాగా సిట్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ల దహనం
ఇక తాజాగా తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్లు దహనానికి సంబంధించి ఏపీలో దుమారం రేగింది. హెరిటేజ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను తగలబెట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపణలు గుప్పించారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన కొల్లి రఘురామిరెడ్డి అలాంటిదేమీ లేదని, తగలబెట్టిన పేపర్లన్నీ వేస్ట్ పేపర్ లనీ ఆయన పేర్కొన్నారు.
జగన్ కు షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం
కొల్లి రఘురామిరెడ్డి వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి అని ఏపీలోని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అందుకే జగన్ ఆయనకు అనేక కీలక బాధ్యతలు అప్పగించారని టాక్. ఇక ఇదే క్రమంలో నిన్న సాయంత్రం ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసి వైయస్ జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications