Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటి ఏరియా టార్గెట్: సెల్‌ఫోన్ల దొంగల అరెస్టు

Cell phone theives arrested in Hyderabad
హైదరాబాద్: ఆటోలో ప్రయాణించే వారిని లక్ష్యం చేసుకుని విలువైన సెల్‌ఫోన్‌లను దొంగిలించే ఓ ముఠాను హైదరాబాదులోని మాదాపూర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ పోలీస్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎసిపి శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ నర్సింహులు, క్రైం ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు.

యాకత్‌పురకు చెందిన సయ్యద్ సదా త్ అలీ(24), అసూలుమ్‌ఖాన్(29), సయ్యద్ ద స్తగిరి భాష(28)తోపాటు అదే ప్రాంతానికి చెంది న సయ్యద్ యూసుఫ్ కలిసి దొంగతనాలు చేస్తుంటారు. వీరు ఏపీ11టీఏ08సీ1 ఆటోను కొనుగోలు చేశారు. నగరంలో ఆటో నడుపుతూ వీరిలో ఒకరు ఆటోడ్రైవర్‌గా, మరో ముగ్గురు ప్యా సింజర్‌లుగా ఆటోలో కూర్చొని ప్రయాణికుల సె ల్‌ఫోన్‌లను దొంగిలించడం ప్రారంభించారు

కొద్దిరోజులుగా ఐటీ ఏరియాను అడ్డాగా మార్చుకు ని ప్రయాణికుల సెల్‌ఫోన్‌లను కాజేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక గాలింపులు చేపట్టారు. బుధవారం వీరు పోలీసుల కంట పడడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు.

వీరి నుంచి 16 సెల్‌ఫోన్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సెల్‌ఫోన్‌లను ఆబిడ్స్‌లోని బడాబజార్‌లో మైమత్‌ఖాన్ అనే వ్యక్తికి తక్కువ ధరలకు అమ్మినట్టు వెల్లడించారు. ఈ కేసులో మైమత్‌ఖాన్‌ను కూడా అరెస్టు చేసినట్లు క్రైం ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+