విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ నిట్‌లో 8 కోర్సులు, 480 సీట్లు: వచ్చే ఏడాది నుంచి అమలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కోర్సులు, సీట్లు ఖరారైనట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు లేఖ రాశారు.

దీంతో ఏపీ నిట్‌లో కోర్సులు, సీట్లపై స్పష్టత వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకానున్న ఏపీ నిట్‌లో మొత్తం 8 కోర్సులు, 480 సీట్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేంద్రం ఒక లేఖ రాసింది.

Center allocated 480 seats for andhra pradesh nit

ఏపీ నిట్‌లో కోర్సులు:

* బయో టెక్నాలజీ - 30 సీట్లు
* కెమికల్ ఇంజనీరింగ్ - 30
* సివిల్ ఇంజనీరింగ్ - 60
* కంప్యూర్ సైన్స్ ఇంజనీరింగ్ - 90
* ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 90
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - - 90
* మెకానికల్ ఇంజనీరింగ్ - 60
* మెట్రలజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 30 చొప్పున సీట్లు కేటాయిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.

ఏపీ నిట్‌కు కేటాయించిన 480 సీట్లలో సగం సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్దులకే కేటాయించింది. మిగిలిన సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్ధులకు కేటాయించింది. ఇక, వరంగల్ నిట్‌లో సూపర్ న్యూమరరీ కింద ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర విద్యార్దులకు 60 సీట్లు కేటాయించింది.

English summary
Center allocated 480 seats for andhra pradesh nit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X