Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడు పోలవరంపై కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో కీలకభేటీ.. సమావేశంలో నాలుగు రాష్ట్రాలు; అజెండా ఇదే!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది. ఈ కీలక సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సీఎస్ లు, జల వనరుల శాఖ అధికారులు హాజరు కానున్నారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర గుప్త అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొననున్నారు.

పోలవరం పై కీలక సమావేశం.. అజెండా అంశం ఇదే

పోలవరం పై కీలక సమావేశం.. అజెండా అంశం ఇదే

వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశం ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావంపై 4 రాష్ట్ర ప్రభుత్వాలు సందేహాలను నివృత్తి చేయడం అజెండాగా జరగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల ముంపు ముప్పు ఉండదనే అంశాన్ని వివరించటానికి సిడబ్ల్యుసి, పీపీఏ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని మరోమారు ఈ సమావేశంలో స్పష్టం చేయడానికి రెడీ అయింది.

పోలవరం నిర్మాణంతో ఆ రాష్ట్రాల భయం, సుప్రీంలో పిటీషన్లపై కేంద్రాన్ని నివేదిక కోరిన ధర్మాసనం

పోలవరం నిర్మాణంతో ఆ రాష్ట్రాల భయం, సుప్రీంలో పిటీషన్లపై కేంద్రాన్ని నివేదిక కోరిన ధర్మాసనం

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ నెల ఆరవ తేదీన విచారణ జరిగిన విషయం తెలిసిందే. పోలవరం నిర్మాణంతో తమ రాష్ట్రాలకు ముప్పు పెరిగిందని, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ప్రాజెక్టు ముంపు పై, బ్యాక్ వాటర్ పై తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖను కోరింది. ప్రాజెక్టు పర్యావరణ అంశాలను పరిశీలించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు పై తలెత్తిన అభ్యంతరాల విషయాల్లో ముఖ్యమంత్రులు సిఎస్ లతో చర్చలు జరపాలని సూచించిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

పోలవరంపై ఎన్జీటీ తీర్పును సవాల్ చేసిన ఏపీ.. జగన్ సర్కార్ కు సుప్రీం మొట్టికాయలు

పోలవరంపై ఎన్జీటీ తీర్పును సవాల్ చేసిన ఏపీ.. జగన్ సర్కార్ కు సుప్రీం మొట్టికాయలు

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని 120 కోట్ల రూపాయలు పర్యావరణ రుసుము చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం పోలవరం నిర్మాణంలో భాగంగా జరిగిన పర్యావరణ నష్టానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. న్యాయవాదులకు ఫీజు చెల్లించడానికి డబ్బులు వెచ్చిస్తున్న ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పై శ్రద్ధ ఎందుకు పెట్టడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది.

 ఏపీ ప్రభుత్వానికి కేసులపై ఉన్న శ్రద్ధ పర్యావరణంపై లేదని సుప్రీం ఆగ్రహం

ఏపీ ప్రభుత్వానికి కేసులపై ఉన్న శ్రద్ధ పర్యావరణంపై లేదని సుప్రీం ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు కేసులో ఇప్పటివరకు ఎంత డబ్బు న్యాయవాదులకు ఖర్చు పెట్టారన్న దానిపై నోటీసు ఇస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వాలకు న్యాయవాదులను రంగంలోకి దించటం పై ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణ పైన లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు పోలవరం పురుషోత్త పట్నం, పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టు లపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్ లను కలిపి వింటామని ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో తాజాగా పోలవరం ముంపు పైన, బ్యాక్ వాటర్ పైన, పర్యావరణ ఉల్లంఘన పైన నేడు ప్రధానంగా చర్చ జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+