ఏపీలోని వారికి కేంద్రం తీపికబురు.. రూ.1668 కోట్లు, వారి ఖాతాల్లోకే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో మే 15వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు చెల్లించవలసిన వేతన బకాయిల సొమ్మును కేంద్రం విడుదల చేసింది. మొత్తం 1668 కోట్ల రూపాయలను కేంద్ర ఉపాధి హామీ కూలీల కోసం విడుదల చేసింది. ఈ వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు.

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న వారికి శుభవార్త
ఏపీలోని ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇవ్వనుంది. త్వరలో మరో 137 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు తీరనున్నాయి. కార్మికుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. ఇది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి నిజంగానే శుభవార్త అని చెప్పాలి.

Center good news to the laborers working under the employment guarantee scheme 1668 crore rupees released for their payments

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నరేగా పథకంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఈ శాఖలో ముఖ్యంగా నిరుపేద ఉపాధి హామీ కూలీలకు సంబంధించి, వారికి జీవన ఉపాధి కల్పించడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు.

ఉపాధి హామీ కూలీల ఎక్స్ గ్రేషియా పెంచిన ఏపీ ప్రభుత్వం
ఇటీవల ఈ శాఖలో పదోన్నతులు కూడా కల్పించనున్నట్టు ప్రకటించారు. ఎంతోకాలంగా ఈ శాఖలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఉపాధి హామీ శ్రామికులకు పరిహారం పెంచిన ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పని ప్రదేశాలలో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్గ్రేషియా కూడా పెంచింది.

ఉపాధి హామీ కూలీల సంక్షేమానికి కట్టుబడిన ఏపీ ప్రభుత్వం
అంతకుముందు ఉపాధి హామీ శ్రామికులు చనిపోతే 50 వేల రూపాయలను ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ ఎక్స్గ్రేషియాని రెండు లక్షల రూపాయలకు పెంచింది. పని ప్రదేశాలలో గాయపడి శాశ్వత వైకల్యం పొందితే ఇచ్చే పరిహారాన్ని లక్ష రూపాయలకు పెంచారు. పని ప్రదేశంలో గాయపడి శాశ్వతంగా మంచం పడితే వారికి రెండు లక్షల రూపాయల పరిహారం అందిస్తారు.

కేంద్ర సహకారంతో ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు
పని ప్రదేశాలలో ఆరేళ్లలోపు పిల్లలు గాయపడి వికలాంగులు అయితే పరిహారం లక్ష రూపాయలకు పెంచుతూ నిర్ణయించింది ప్రభుత్వం. మొత్తంగా ఉపాధి హామీ కూలీల సంక్షేమం, వారి వేతనాల చెల్లింపు పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో వారికి తీపి కబురు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+