వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ ... మూడు మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం జగన్ ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలతో పాటు మరో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చెయ్యాలని భావించారు . అందుకోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జగన్ సర్కార్ కు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. అంతేకాదు కేంద్రం వాటా 60 శాతంగా రాష్ట్రం వాటా 40 శాతంగా కూడా నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మూడు చోట్ల మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

Recommended Video

Good News! Central Govt Announce 3 Medical Colleges In AP

ఏపీలో మరో 4 పోర్ట్ ల ఏర్పాటుకు సర్కార్ సిద్ధం: డీపీఆర్ లు,పర్యావరణ అనుమతులతో పనులు వేగంఏపీలో మరో 4 పోర్ట్ ల ఏర్పాటుకు సర్కార్ సిద్ధం: డీపీఆర్ లు,పర్యావరణ అనుమతులతో పనులు వేగం

 ఏపీలో మూడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్రం అనుమతులు

ఏపీలో మూడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్రం అనుమతులు

సీఎం జగన్ ఏపీని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చాలని వైద్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు చెయ్యనున్నారు. ఇక కేంద్రం కూడా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటంతో గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి నుండి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలు పంపారు .

 కేంద్రం వాటా 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం

కేంద్రం వాటా 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం

ఏపీలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరిన క్రమంలో కేంద్రం మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇక ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 కోట్లను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఇలా మూడు కాలేజీలకు మొత్తంగా రూ. 975 కోట్లు ఖర్చు చెయ్యనున్నారు . ఇందులో కేంద్రం వాటా 60 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుందని మోదీ సర్కార్ నిర్ణయించింది.

 వైసీపీ సర్కార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం

వైసీపీ సర్కార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం

ఇక దీనితో ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. మొత్తంగా ఏపీలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సానుకూలంగా స్పందించటం పట్ల వైసీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విషయంలో ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాల్లో సానుకూలంగా వ్యవహరించాలని చాలా సార్లు వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపధ్యంలో మూడు మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ముదావహం .

English summary
Special focus is on the medical department to make CM Jagan AP a healthy andhra pradesh. As part of this, three medical colleges will be set up. The Center is also planning to set up medical colleges in Gurajala, Guntur district, Paderu in Visakhapatnam and Machilipatnam in Krishna district . The central government has issued orders to this extent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X