తిరుమల భక్తులకు కేంద్రం భారీ వరం, కొత్తగా ఇక..!!
Tirumala: తిరుమల భక్తుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమలలో భక్తుల సౌకర్యాల పైన టీటీడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తిరుమలలో ఉచిత బస్సు సౌకర్యం టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహి తంగా మార్చేందుకు తిరుమల- తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్తు బస్సు లు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు కనుమదారుల్లో తిరుగుతుండగా, మరో 350 బస్సులు విడతలవారీగా రానున్నాయి. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా స్కీమ్ కింద కేంద్రం 300 బస్సులు 'తిరుమల- తిరుపతి' కేటాయించారు.
భక్తుల కోసం
తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో కేంద్రం సైతం వరుస నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తోం ది. తిరుపతి బస్టాండ్ కు ఆధునిక సొబగులు.. సౌకర్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు తిరుమల భక్తుల కోసం ఏకంగా 300 ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా స్కీమ్ కింద కేంద్ర ఏపీకి దాదాపు 750 బస్సులు కేటాయించగా.. అందులో 50 బస్సులు ప్రస్తుతం తిరుపతి - తిరుమలకు అందుబాటులోకి తెచ్చారు. కాగా, ఇవి కాకుండా తిరుమలకు మరో 300 బస్సులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర గృహ, పట్ణణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయగా, అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది.

తాజా కేటాయింపులు
మొదటి దశలో కేంద్రం ఇచ్చే 50 బస్సులను మంగళం డిపోనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రానున్న 300 బస్సుల్లో తిరుమల డిపోనకు 150, అలిపిరి డిపోనకు 50, తిరుపతి ఇంట్రా మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా కేటాయించే డిపోనకు 50, శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య మరో 50 బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో తిరుమలలో 150 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర సాంకేతిక ఏర్పాట్లకు వీలుగా 5 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో కొత్త అద్బుతం సిద్దం అవుతోంది. భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్‌ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్దమైంది.
రూ 500 కోట్లతో టర్మినల్
తిరుపతి బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు స్కే వే సిద్దం కానుంది. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త హంగులతో తిరుపతి బస్ స్టేషన్ త్వరతోనే ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేసింది. 13 ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్టేషన్ లో ప్రస్తుతం 66 ప్లాట్ ఫాంలు ఉన్నాయి. నిత్యం దాదాపు 1.60 లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటూరు. దేశ వ్యాప్తంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం పూర్తి హంగులతో తీర్చి దిద్దాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications