వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపీ రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఆస్తుల వేలం, రూ.452.41 కోట్ల రుణం చెల్లించకపోవడంతో..

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని, బకాయి చెల్లించలేదు. దీంతో కంపెనీకి చెందిన ఆస్తుల వేలం వేస్తామని ప్రకటించింది. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్ల రుణం కూడా తీసుకున్నది. సెంట్రల్ బ్యాంక్‌కు రూ.452.41 కోట్ల బకాయి పడటంతో వేలం వేస్తున్నట్టు ప్రకటించారు.

రాయపాటి సాంబశివరావుకి చెందిన ట్రాన్ర్ ట్రాయ్ కంపెనీ.. కన్ స్ట్రక్షన్ సంస్థ. సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంక్ నుంచి రుణం తీసుకొని చెల్లించలేదు. లోన్ తీసుకునేముందు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నామని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వచ్చే నెల 18వ తేదీన వేలం వేస్తామని.. వేలంలో పాల్గొనేవారు 14వ తేదీ లోపు బిడ్ దాఖలు చేయాలని గడువు విధించింది.

central bank auction notice to tdp ex mp rayapati sambasiva rao company..

రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ కూడా కొద్దిరోజుల క్రితం పత్రికా ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరుతో రుణం తీసుకున్నారు.

Recommended Video

#HappyBirthdayKTR : KTR కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు! || Oneindia

లోన్‌కు గ్యారెంటీగా రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్‌ వాణి, జగన్‌మోహన్‌ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదంటే టెండర్స్‌ డాట్‌ గవ్‌ డాట్‌ ఇన్‌ను సంప్రదించాలని బ్యాంక్ ప్రకటనలో పేర్కొంది.

English summary
central bank auction notice to tdp ex mp rayapati sambasiva rao transstroy assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X