వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..

|
Google Oneindia TeluguNews

టిడిపి కి మాజీ కేంద్ర‌ మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న టిడిపిలో ప‌డిన ఆవేద‌న వివ‌రి స్తూ పార్టీ వీడుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అదే విధంగా క‌ర్నూలు జిల్లా కోడుమూరు లో 2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలిచి టిడిపిలోకి వెళ్లిన మ‌ణిగాంధీ తిరిగి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరారు.

టిడిపికి రాజీనామా..

టిడిపికి రాజీనామా..

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ సీనియర్‌ నేత సాయిప్రతాప్‌ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్‌ వెల్లడించారు. కాగా రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఈ సారి ఎన్నికల్లో తనకు గానీ, తన అల్లుడు సాయి లోకేష్‌కు గానీ రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కానీ, టీడీపీ అధినేత ఆయనకు టికెట్ నిరాకరించారు.

అర‌ణ్య వాసం నుండి బ‌య‌ట‌కు

అర‌ణ్య వాసం నుండి బ‌య‌ట‌కు

దిక్కుతోచని స్థితిలో త‌న ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరానని వివ‌రించారు. రాయలసీమ సమ స్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు లేఖలు ఇచ్చినా.. ఇంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదని వివ‌రించారు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉంద న్నారు. రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉండమన్నారు... కానీ పార్లమెంట్ పరిధిలో జరిగే ఎటువంటి పార్టీ కార్య క్రమాలపై త‌న‌కు సమాచారం ఇవ్వరని పేర్కొన్నారు. ఇన్‌ఛార్జ్‌కు పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకున్నాన‌ని. నా అల్లుడు సాయి లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగినా మొండిచేయి చూపించారన్నారు. సాయి ప్ర‌తాప్ రెండు రోజుల్లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరుతార‌ని తెలుస్తోంది.

వైసిపి లోకి మ‌ణిగాంధీ రీ ఎంట్రీ..

వైసిపి లోకి మ‌ణిగాంధీ రీ ఎంట్రీ..

క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీ తిరిగి వైసిపి లో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో మ‌ణిగాంధీ వైసిపి నుండి కోడుమూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌రువాత ఆయ‌న టిడిపి లోకి ఫిరాయించారు. టిడిపిలో ప్రాధాన్య‌త ద‌క్క‌క పోవ టంతో ఆయ‌న ఓపెన్ గానే తాను పార్టీ మారి త‌ప్పు చేసాన‌ని అప్ప‌ట్లోనే అంగీక‌రించారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో కోడుమూ రు నుండి ఆయ‌న‌కు టిడిపి టిక్కెట్ నిరాక‌రించారు. దీంతో..ఆయ‌న తిరిగి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరారు. ఈ ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు కోసం తిరిగి ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

English summary
Ex central Minister Sai Pratap resigned TDP and may joined in YCP shortly. He expected Loksabha seat form Rajampet Constituency. Kodumuru MLA Mani Gandhi re join YCP in presence of Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X