బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీ
అమరావతి: విజయవాడలో త్వరలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
విజయవాడ మెట్రో నిర్మాణాన్ని 25 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించాలన్నారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడలను కలుపుతూ మెట్రో రైలుని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన శ్రీధరన్ కమిటీ మెట్రో ప్రాజెక్టు తుది నివేదికను ఆయనకు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను ఢిల్లీ మెట్రో కార్పోరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది.

ముందుగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 25 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మెట్రో రైలు మార్గానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అవేమిటంటే రాష్ట్ర, నగర స్ధాయిలో పట్టణ రవాణానిధి ఏర్పాటు చేయాలి.
అంతేకాదు కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. ఎన్నో ఏళ్లుగా విజయవాడకు మెట్రో కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఇప్పుడది ప్రారంభం లాంఛనమే కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications