వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి మూడు ఎయిర్ పోర్టులు-రఘురామ ప్రశ్నకు కేంద్రం జవాబు-పేర్లు రాష్ట్రాల ఇష్టమే

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. ఏపీలోనూ విమానాశ్రయాల అభివృద్ధికి సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చినట్లు ఇవాళ లోక్ సభలో వెల్లడించింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పౌరవిమానయానశాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఏపీకి కొత్త ఎయిర్ పోర్టులు

ఏపీకి కొత్త ఎయిర్ పోర్టులు

ఏపీలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటికి తోడు కడప, ఓర్వకల్లులోనూ మరో రెండు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సూత్రప్రాయంగా అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్రం ఇవాళ పార్లమెంటులో ప్రకటించింది. దీంతో ఏపీలో ఎయిర్ ట్రాఫిక్ మరింత పెరగబోతోంది.

రఘురామ ప్రశ్నకు జవాబు

రఘురామ ప్రశ్నకు జవాబు


వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీలో కొత్త ఏయిర్ పోర్టులపై కేంద్రాన్ని లోక్ సభలో ప్రశ్నించారు. దీంతో ఆయన ప్రశ్నకు పౌర విమానయానశాఖ సహాయమంత్రిగా ఉన్న జనరల్ వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన అనుమతుల్ని ప్రస్తావించారు. ఆయా విమానాశ్రయాల్ని అభివృద్ధి, నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు నిర్మాణ సంస్ధలదేనని ఆయన స్పష్టం చేశారు.

మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు

మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు

ఏపీలో కొత్తగా మూడు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు తాము ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. ఇందులో ఓర్వకల్లు, భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ఇప్పటికే పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభమైనట్లు ఆయన లోక్ సభకు తెలిపారు. మరో రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఇందులో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ.2500 కోట్లు, దగదర్తి విమానాశ్రయానికి రూ.293 కోట్లు ఖర్చవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విమానాశ్రయాల పేర్లు రాష్ట్రాల ఇష్టమే

విమానాశ్రయాల పేర్లు రాష్ట్రాల ఇష్టమే


ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలకు పేర్లు మార్చడం లేదా, కొత్తగా వచ్చే విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్ట్రాల మేరకు జరుగుతున్నట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ లోక్ సభకు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపితే కేంద్రం వాటిని ఆమోదిస్తోందన్నారు. ఇప్పటికే 13 రాష్ట్రాల నుంచి విమానాశ్రయాల పేర్ల మార్పుకు ప్రతిపాదనలు అందినట్లు వీకే సింగ్ తెలిపారు. వీటిపై తుది నిర్ణయం మాత్రం కేంద్రానిదేనని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

English summary
the union government on today says that it has given permission to three new airports in ap, reply to a question from ysrcp mp raghurama krishnam raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X