స్వచ్ఛ భారత్: పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్'కు కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరికొందరిని నామినేట్ చేసింది. సినీ రంగం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నితిన్, సుద్దాల అశోక్ తేజతో పాటు ఆంద్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, నాగార్జున సతీమణి అమల ఉన్నారు.
ఇక క్రీడా రంగం నుంచి వివిఎస్ లక్ష్మణ్, కోనేరు హంపి, పుల్లెల గోపీచంద్, శివలాల్ యాదవ్ లను, ఐటీ రంగం నుంచి మోహన్ రెడ్డి చౌదరి, పారిశ్రామిక రంగం నుంచి జీవీకే, మై హోం అధినేత రామేశ్వరరావులు నామినేట్ అయ్యారు. జనవరి 5వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొని వీరందరిని నామినేట్ చేయనున్నారు.

ఇందులో భాగంగా ముందుగానే కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన వారికి ఫోన్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో ‘స్వచ్చ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న బాడ్మింటన్ స్టార్ పివి సింధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జ్వాలా గుత్తా, లియాండర్ పేస్ లను ఈ ‘స్వచ్చ భారత్'లో కాంపెయిన్‌లో పోల్గోనాల్సిందిగా నామినేట్ చేస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications