ప్రత్యేక హోదా రాకున్నా.., పెట్టుబడులకి పోటీ: సుజన
హైదరాబాద్: కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన అన్ని రకాల నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి శుక్రవారం అన్నారు. ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల్లో కేంద్రం సహకరిస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు విరివిగా కేంద్ర నిధులు అందుతాయన్నారు. రాజధాని నిర్మాణాకి కేంద్రం 15 రోజుల్లో తొలి విడతగా రూ.రెండు వేల కోట్లు విడుదల చేస్తుందన్నారు.

విభజన చట్టంలో చెప్పిన తరువాత వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదన్నారు. రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, తదితర నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.
అదేవిధంగా విభజన చట్టంలో పేర్కొన్న ఎయిమ్స్, వైజాగ్-చెన్నై పరిశ్రామిక కారిడార్, ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఐఓసీ రిఫైనరీ పరిశ్రమ, పోర్టులు, తదితరాలన్నీ రాష్ట్రానికి వస్తాయన్నారు. ఇకపోతే రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ను కేటాయిస్తారన్నారు.
14వ ఆర్థిక సంఘంలో వీటికి సంబంధించి నిధులు కేటాయిస్తారని మంత్రి చెప్పారు. ఎయిమ్స్‌కు మంగళగిరి వద్ద స్థలం సేకరించిడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, సంస్థలు పోటీ పడుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications