Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం శుభవార్త.. 27వేల కోట్ల రూపాయల ఏపీ ప్రాజెక్ట్ కు కేంద్రం గడువు పెంపు!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తోంది. గడువు ముగిసిపోతున్న అనేక పెండింగ్ ప్రాజెక్టులకు గడువు పొడిగింపునిచ్చి భారీ ఊరటను ఇస్తోంది.

ఆ కేంద్ర పథకం కోసం గత 18 నెలలుగా ఏపీ ప్రభుత్వ కష్టం

ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుకు కేంద్రం గడువును పొడిగించింది. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పడకేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం గత 18 నెలలుగా కష్టపడుతోంది.

central govt said good news to ap govt it has extended the deadline for the Jal Jeevan Mission

27 వేల కోట్ల రూపాయల పనులకు అనుమతులు

కేంద్రం ఈ పథకానికి 27 వేల కోట్ల రూపాయల పనులకు అనుమతులు ఇచ్చినా, గత ఏళ్లలో కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో సమకూర్చుకోకపోగా , నిధుల లభ్యత లేకపోవడంతో జల జీవన్ మిషన్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

సుమారు 84 వేల ఐదు వందల కోట్లతో డీపీఆర్

అయితే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల నుండి అన్ని కాలాలలోనూ తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని సుమారు 84 వేల ఐదు వందల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది. 2024- 2025 సంవత్సరంలోనే ముగిసిపోయిన ఈ పథకం గడువును పొడిగించాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్రం 2028 వరకు పథకం గడువును పొడిగించి ఆరి ఊరటను ఇచ్చింది.

గడువు పొడిగించిన కేంద్రం

ఈ గడువు పెంపు వల్ల రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం ఏపీకి లభించింది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి కూడా రాష్ట్రానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం గడువు పొడిగింపుతో 27 వేల కోట్ల రూపాయల తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది.

రాష్ట్ర వాటా కోసం నిధులు

ఈ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్రం జాతీయ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్ గురించి పదివేల కోట్ల రూపాయల రుణం తీసుకుని, మరో 3 వేల కోట్ల రూపాయలను కలిపి మొత్తం 13 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించింది. మొత్తంగా కేంద్రం అందిస్తున్న ఈ పథకాన్ని 2028 లోగా పూర్తి చేయాల్సిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించడం లక్ష్యంగా ఈ మిషన్ పైన ఫోకస్ చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+