Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే కీలక భేటీ - "హోదా" అంశం తొలిగించినా : హోం శాఖతో వీటి పైనే ప్రధాన చర్చ..!!

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో కీలక భేటీ నేడు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలపై ఏర్పాటైన ఉపసంఘం మొదటి సమావేశం కావటంతో రెండు రాష్ట్రాల్లోనూ దీని పైన ఆసక్తి నెలకొని ఉంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్న, అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం ఫిక్స్ చేసే సమయంలో తొలుత అజెండాలో ఏపీ ప్రధాన డిమాండ్ అయిన ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో హోదా అంశాన్ని తొలిగించి అయిదు పెండింగ్ అంశాల పైనే ఈ చర్చను పరిమితం చేసారు.

హోం శాఖ - రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో

హోం శాఖ - రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్‌ కుమార్‌ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్‌లు ఎస్‌ఎస్‌ రావత్, రామకృష్ణారావు సమావేశానికి హాజరు అవుతున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి దీనికి హాజరు కానున్నారు. అజెండాలో చర్చించేందుకు నిర్దేశించిన అయిదు అంశాల్లో ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన.. ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన విద్యుత్‌బకాయిలు.. పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం..బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్ల పంపిణీ.. వీటితో పాటుగా ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు అంశం అజెండాలో చేర్చారు.

అయిదు అంశాలతో అజెండా ఫిక్స్

అయిదు అంశాలతో అజెండా ఫిక్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అంశం ప్రస్తావించేందుకు సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌ విద్యుత్తు బిల్లులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉప కమిటీ సమావేశంలో కోరనుంది.

రెండు రాష్ట్రాల వాదనలు సిద్దం

రెండు రాష్ట్రాల వాదనలు సిద్దం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరాలని డిసైడ్ అయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీని పైన హోం శాఖ పరిష్కారం చూపించాల్సి ఉంది.

Recommended Video

    Andhra Pradesh లో అభివృధి కాంగ్రెస్ తోనే పోయింది - Ex MP Harsha Kumar చురకలు | Oneindia Telugu
    హోదా ప్రస్తావన - తొలిగింపు పైనా

    హోదా ప్రస్తావన - తొలిగింపు పైనా


    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) ఆస్తుల విభజనపైనా చర్చ జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి 2005-06లో ప్రభుత్వ ఈక్విటీ కింద డబ్బులకు బదులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఎకరం రూ.40 లక్షల చొప్పున 270 ఎకరాలను కేటాయించింది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఇక, తొలుత అజెండాలో చేర్చి..తరువాత తొలిగించిన హోదా అంశం పైన హోం శాఖ నుంచి వివరణ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+